ప్రస్తుతం బిగ్ బాసీ సీజన్ 5 తెలుగులో నడుస్తున్నది.ఫస్ట్ ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.
వీరిలో లేడీస్ తక్కువగా ఉన్నారు.విచిత్రం ఏంటంటే.
ఇందులోంచి వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు.ఇప్పటి వరకు ఆరుగురు లేడీస్ బయటకు వెళ్లిపోయారు.
మొదట లహరి బయటకు రాగా, ఆ తర్వాత వరుసగా హమీద, ఉమాదేవి, శ్వేతావర్మ, సరయు చివరకు ప్రియా ఇలా ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు.బిగ్ బాస్ ఫిమేల్ కంటెస్టెంట్స్‌నే ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నాడనేది తెలియడం లేదు.
కాజల్, అని, సిరి, ప్రియాంక సింగ్ మాత్రమే ప్రస్తుతం హౌజ్‌లో ఉన్నారు.సీజన్ ఇంకా 50 రోజులకు పైగానే ఉంది.మరి వీళ్లైనా హౌజ్‌లో ఉంటారా లేక ఎలిమినేట్ చేస్తారా? తెలియదు.బిగ్ బాస్ షో చాలా మంది చూసేది కేవలం లేడిస్ కోసమే.
వీరు సైతం బయటకు వెళ్లిపోతే ఇక అది మగాళ్ల షోగా మారిపోతుంది.అయితే ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఫిమేల్ కంటెస్టేంట్స్ను బయటకు పంపేసి.
వైల్డ్ కార్డు ద్వారా కొత్తగా ఫిమేల్ కంటెస్టెంట్‌ను తీసుకొచ్చి హౌజ్‌కు మరింత గ్లామర్‌ను తీసుకొద్దామని బిగ్ బాస్ భావిస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి.అయితే ఇందులో భాగంగానే టీవీ యాంకర్ విష్ణు ప్రియ హౌజ్‌లోకి వస్తున్నదని టాక్.
ఇందుకు ఇప్పటికే ఆమె రెడీ అయిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.మరి విష్ణు ప్రియా ఎంట్రీతో హౌజ్‌లో జరిగబోయే పరిణామాలేంటో చూడాలి మరి.దీనికి తోడు ఎలిమినేషన్ టైం దగ్గర పడుతున్న ప్రతి సారి హౌజ్‌లో ఉన్న వారిలో టెన్షన్ స్టార్ట్ అవుతుంది.ఈ సారి బయటకు వెళ్లేది ఎవరో అంటూ లోలోపల టెన్షన్ పడుతున్నారు.
మరి నెక్ట్స్ ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు.