అమెరికా అధ్యక్షుడు అంటే మాటలా, ప్రపంచానికి పెద్దన్న, ఏ దేశం తన మాట వినకపోయినా నయానో భయానో భయపెట్టి మరీ తమవైపుకు తిప్పుకుని తమకు ఎదురు లేదని తమతో పెట్టుకుంటే అంతే సంగతులు అనేలా హెచ్చరికలు జారీ చేస్తుంది.అత్యాధునికమైన టెక్నాలజీ, నిష్టాతులు అయిన సైనికులు, ఇంటిలిజెన్స్ వ్యవస్థ, అంగబలం, ఆర్ధిక బలం అమెరికా సొంతం.
మరి అలాంటి దేశానికి అద్యక్షుడు అంటే సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.అధ్యక్షుడు చెంతకు ఈగ వెళ్ళాలన్నా అతడి చుట్టూ ఉండే సెక్యూరిటీ అనుమతి ఉండాల్సిందే.
అలాంటి అధ్యక్షుడు భద్రతా వ్యవస్థను ఓ చిన్న విమానం ఉరుకులు పరుగులు పెట్టించింది.అసలేం జరిగిందంటే.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నివాసం ఉండే ప్రాంతం వద్దకు గుర్తు తెలియని విమానం ఒకటి చెక్కర్లు కొట్టింది.దాంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరం నెలకొంది.ఏం జరుగుతుందో ఒక్కసారిగా ఎవరికూ అంతుచిక్కలేదు.ఊహించని ఈ ఘటనతో బిడెన్ సెక్యూరిటీ ఉరుకులు పరుగులు పెట్టింది.
ఈ ఘటనపై ఆందోళన నెలకొన్న నేపధ్యంలో వైట్ హౌస్ కి చెందిన అధికార యంత్రాంగం ఓ ప్రకటన జారీ చేసింది.
ఓ ప్రవైటు విమానం అధ్యక్షుడు నివాసం ఉండే రెహబొత్ డెలావియర్ లోని ఇంటికి దగ్గరగా వాషింగ్టన్ కు సుమారు 200 కిమీ దూరంలో గగన తలంలోకి ప్రవేశించింది.
అంతేకాదు నో ఫ్లై జోన్ లోకి సదరు ప్రవైటు విమానం ప్రయాణించడంతో అధికారులు బిడెన్ ను ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తం చేసి కట్టుదిట్టమైన భద్రత మధ్య బిడెన్ ను ఆయన కుటుంభాన్ని సీక్రెట్ ప్లేస్ కి తరలించారు.క్షణాల వ్యవధిలో విమానంపై ఆరా తీయగా అది బిడెన్ సెక్యూరిటీ కోసం నియమించిన ప్రవైటు విమానమని తేలింది.
కానీ ఎలాంటి అనుమతులు లేకుండా విమానం ఎలా పరిధులు దాటి వచ్చింది అనే విషయంపై బిడెన్ సెక్యూరిటీ టీమ్ విచారణ చేస్తోంది.