బజ్.. 'ఆచార్య' రిలీజ్ ఈ మూడు సీజన్స్ లోనే అట !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

 When Is The Announce Release Date Of Acharya, Acharya,chiranjeevi, Ram Charan, K-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో 152 వ సినిమాగా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.సిద్ద అనే పవర్ ఫుల్ రోల్ లో రామ్ చరణ్ కనిపిస్తున్నారు.

ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కనిపిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.రెండు పాటలు మాత్రమే బాలన్స్ ఉన్నాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Telugu Acharya, Chiranjeevi, Kajal Agrwal, Pooja Hegde, Ram Charan, Tollywood-Mo

ధర్మస్థలి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొరటాల శివ కమర్షియల్ అంశాలను జోడించి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా షూట్ కరోనా కారణంగా ఆలస్యం అవ్వడం వల్ల విడుదల కూడా ఆలస్యం అయ్యింది.లేదంటే మే లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

ఇప్పటికే పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్ ప్రకటిస్తుండడంతో ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Telugu Acharya, Chiranjeevi, Kajal Agrwal, Pooja Hegde, Ram Charan, Tollywood-Mo

అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ పై ఒక బజ్ హాట్ టాపిక్ అయ్యింది.ఈ సినిమాను ఈ మూడు సీజన్స్ లో ఏదో ఒక సీజన్ లో ఖచ్చితంగా విడుదల చేస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి.ముందుగా ఈ సినిమా వస్తే క్రిస్మస్ కే వస్తుందట అది మిస్ అయితే ఆ తర్వాత సంక్రాంతి సీజన్ లో అది కూడా మిస్ అయితే మహా శివరాత్రికి ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మరి చూడాలి చివరకు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube