నుదిటి పై వివిధ రకాల బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

What Is The Meaning Behind Different Types Of Bottu On The Forehead

మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మహిళలు బొట్టు ధరించడం ఒక ఆచారంగా కొనసాగిస్తున్నారు.ప్రతిరోజు స్నానమాచరించిన తర్వాత లేదా పూజా కార్యక్రమాలను ముగించుకుని మహిళలు, ముఖ్యంగా పెళ్లైన ఆడవారు నుదుటిపై తిలకాన్ని పెట్టుకుంటారు.

 What Is The Meaning Behind Different Types Of Bottu On The Forehead-TeluguStop.com

అయితే కొన్ని మతాలలోని స్త్రీలు ఎల్లప్పుడు నుదిటిపై తిలకాన్ని పెట్టుకోవడం ఆచారంగా వస్తోంది.అంతేకాకుండా పూజా సమయాలలో దేవతా విగ్రహాలకు కూడా ఆరాధన సూచకంగా బొట్టు పెడతారు.

అయితే కొందరు వేరువేరు రంగులతో పెట్టుకుంటారు.అలా ఎందుకు పెట్టుకుంటారు అసలు బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం….

 What Is The Meaning Behind Different Types Of Bottu On The Forehead-నుదిటి పై వివిధ రకాల బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న అర్థం ఏమిటి-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదట బొట్టును పెట్టుకున్న వారిని చూసినప్పుడు ఎదుటి వారిలో వారికి తెలియకుండా పవిత్ర భావనను తెలియజేస్తుంది.పూర్వకాలంలో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు వివిధ రకాల వారు ఒక్కో రకమైన తిలకాన్ని నుదుటన దిద్దుకొనేవారు.

పురోహితులు లేదా శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణులు తెల్లని చందనాన్ని తిలకంగా ధరించేవారు.

క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియులు యుద్ధ సమయాలలో తమ వీరత్వాన్ని చాటుకునేందుకు ఎర్రటి తిలకాన్ని నుదిటి పై వీర తిలకంగా ధరించేవారు.అలాగే వైశ్య కుటుంబానికి చెందినవారు ఎక్కువగా వర్తక వ్యాపారాలు చేసే వారు కావడంతో వారి వ్యాపార అభివృద్ధికి చిహ్నంగా పసుపు రంగు కేసరితో నుదుటిపై తిలకాన్ని ధరించేవారు.అలాగే శూద్రులు నల్లటి భస్మాన్ని లేదా కాటుకను ధరించేవారు.

ఈ విధంగా ఒక్కో వంశానికి చెందిన వారు ఒక్కో రకమైన తిలకాన్ని నుదుట ధరించేవారు.

మనం ఏదైనా దేవాలయాలను సందర్శించినప్పుడు భగవంతునికి సమర్పించిన చందనము, కుంకుమను ప్రసాదంగా స్వీకరించి నుదుటి పై పెట్టుకుంటారు.

అయితే ఈ బొట్టును రెండు కనుబొమ్మల మధ్య పెట్టడం ద్వారా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.మన శరీరం మొత్తం కనుబొమ్మల మధ్య విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాల రూపంలో కేంద్రీకృతమై శక్తి వెలువడుతుంది.

అంతేకాకుండా బొట్టును ధరించడం వల్ల మన శరీరాన్ని వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.ఈవిధంగా భారతీయులు బొట్టును పెట్టుకోవడం ఒక ఆచారంగా భావిస్తారు.

అంతే కాకుండా మన భారతీయులు బొట్టు పెట్టుకోవడం ద్వారా ఎక్కడ ఉన్నా కూడా సులభంగా గుర్తుపడతారు.

#Indian #Types Bottu #Kumkuma Bottu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube