కరోనా కొత్త రూపు ఒమెక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 90 దేశాలకు విస్తరించింది.అత్యధికంగా ఈ మహమ్మారి బ్రిటన్ పై తన ప్రభావం చూపుతోంది.
కేవలం రెండు రోజుల్లో 15 వేల కేసులు నమోదు కావడంతో పాటు ఇప్పటి వరకూ 12 మందికి పైగా చనిపోవడంతో అన్ని దేశాలు అలెర్ట్ అవుతున్నాయి.దాంతో విదేశాలలో ఉంటున్న భారతీయులను అప్రమత్తం చేస్తూ భారత ఎంబసీలు ఎన్నారైలకు కీలక సూచనలు చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే
కువైట్ లోని భారత ఎంబసీ అక్కడి ఎన్నారైలకు కీలక ప్రకటన చేసింది.ఒమెక్రాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న క్రమంలో ఎంబసీ ముందస్తు చర్యలలో భాగంగా ఎన్నారైలు అందరితో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది.ఈ నెల 22 వ తేదీన కువైట్ లోని భారతీయ ప్రవాసులు అందరూ ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమానికి తప్పకుండా రావాలని పిలుపునిచ్చింది.22తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపింది.
కువైట్ వ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయ కార్మికులు, ఇంజనీర్లు,నర్సులు, వివిధ రంగాలలో పనిచేసే ప్రతీ ఒక్కరూ ఈ ఓపెన్ హౌస్ లో పాల్గొని తాము ఎదుర్కునే సమస్యలపై చర్చించాలని సూచించింది.ఈ కార్యక్రమాన్ని ఎంబసీ అంబాసిడర్ సిబి జార్జ్ అధ్యక్షతన నిర్వహించనున్నారని, సమస్యల పరిష్కారాలను సిబి జార్జ్ సూచిస్తారని తెలిపింది.ఎంబసీ ఆడిటోరియం లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, ప్రత్యక్షంగా ప్రతీ ఒక్కరూ పాల్గొనవచ్చునని, అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతులు ఉన్నాయని పేర్కొంది.అయితే ఈ కార్యకమానికి ఆన్లైన్ ద్వారా పాల్గొనదలిచిన వారు https://indembkwt.gov.in/officers.php లింక్ ఓపెన్ చేసి రిజిస్టర్ అవ్వాలని తెలిపింది.కొత్త వేరియంట్ ప్రభావం, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వ్యాక్సినేషన్ తదితర విషయాలపై ఈ డిబేట్ లో చర్చించనున్నారట.