భారతీయులు కొత్త వారు ఎవరైనా ఎదురైనా, గౌరవ సూచకంగా ఉపయోగించే మొదటి పలకరింపు నమస్కారం.రెండు చేతులు జోడించి చిరు నవ్వుతో నమస్కారం అని చెబితే అవతలి వ్యక్తి ఎంత వారు అయినా ముగ్దుడు అవ్వాల్సిందే.
చిరునవ్వుతో నమస్కారం చేసి ఎన్నో అద్బుతాలను క్రియేట్ చేయవచ్చు అనేది ప్రముఖుల మాట.మనం దేవుడి ముందు రెండు చేతులు జోడించి నమస్కారం పెడతాం.అలాగే అతిథులు ముందు కూడా నమస్కారం అనేది పెట్టడం వల్ల చాలా గొప్ప లాభం చేకూరుతుందని నిపుణులు అంటున్నారు.
ఒక వ్యక్తిని మనం మొదటి సారి కలిసిన సమయంలో షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకుంటే ఆ వ్యక్తి ఆరు నెలలు లేదా సంవత్సరం వరకు గుర్తుండే అవకాశం ఉంది.
కాని అదే వ్యక్తికి నమస్కారం పెట్టి పరిచయం చేసుకుంటే ఎక్కువ కాలం గుర్తు ఉంటాడట.ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగం చేసి మరీ గుర్తించారు.
పలువురిపై పలు రకాలుగా పరిశోధనలు చేసిన వారు అనేక విషయాలను గుర్తించారు.నమస్కారం చేయడం వల్ల ఉన్న ఉపయోగాలను వారు గుర్తించి ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాలను వెల్లడించారు.
భారతీయులకు గర్వకారణంగా ఉన్నాయి.
ఈ విషయాలు మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే నమస్కారం అనేది ఎన్నో రకాల ఉపయోగాలను కలిగి ఉంది.
అదేంటి అంటే చేతులతో నమస్కారం చెప్పిన సమయంలో మన రెండు చేతులకు సంబంధించిన అయిదు అయిదు పది వేళ్లు కూడా టచ్ చేయబడతాయి.వేళ్లను బలంగా అదమడం వల్ల నరాలు ఉత్తేజం చెంది, మెదడుకు సంబంధించిన కొన్ని కేంద్రాలు ఉత్తేజితం అవుతాయి, అలాగే చెవులు కూడా మామూలు సమయం కంటే రెట్టింపు శక్తితో పని చేస్తాయి.
అందువల్ల నమస్కారం పెట్టి పరిచయం చేసుకున్న వ్యక్తి గురించి ఎక్కువ కాలం గుర్తు ఉంటుందని, ఆ సమయంలో మాట్లాడిన మాటలు, విన్న మాటలు ఎక్కువ కాలం గుర్తు ఉంటాయని శాస్త్రవేత్తలు నిర్థారించారు.
నమస్కారంలో గొప్ప సంస్కారం మాత్రమే కాదు, అత్యంత శాస్త్రీయమైన ప్రయోజనం కూడా ఉంది.అందుకే ఇకపై కొత్త వారితో పరిచయం సమయంలో తప్పకుండా నమస్కారం పెట్టండి.ఈ విషయాన్ని అందరికి షేర్ చేసి నమస్కారం యొక్క గొప్పదనం తెలియజేయండి.