నేడు దేశవ్యాప్తంగా 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటూ ఉన్నాం.శౌర్యం తెలిపే ఎర్రదనం, శాంతిని చూపే తెల్లదనం, త్యాగాన్ని తెలిపే కాషాయం, పైరు పంటల పచ్చదనం, ధర్మనికి నిదర్శనం అశోక చక్రం ఇవన్నీ కలిసి ఉండేది మన జాతీయ జెండా.
మనం జాతీయ పతాకం పట్ల ప్రేమ అభిమానాలు ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే ఉంటాం.అయితే జాతీయ పథకం గురించి కొన్ని నియమాలు ఇప్పుడు తెలుసుకుందామా.
జాతీయ జెండాను సూర్యుడు ఉదయించక ముందే కంటే ఎగురవేయ కూడదు.అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ జాతీయ జెండా భూమికి తగలకూడదు.జాతీయ జెండాను తలకిందులుగా పోల్ కి అసలు కట్టకూడదు.అలాగే జాతీయ జెండా పై ఎటువంటి రాతలు రాయకూడదు.జాతీయ జెండా కు ఎలాంటి అలంకరణ గాని తోరణాలు గాని దుస్తులు గాని కట్టకూడదు.అంతేకాకుండా జాతీయ జెండాలను వాణిజ్య పరమైన లాభాల కోసం ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదు.
ముఖ్యంగా జాతీయ జెండాను ఎగరవేసే సమయంలో వేరే ఏ జెండా గాని అక్కడ ఉండకూడదు.
ఎవరైనా సరే ప్లాస్టిక్ జెండాలను ఉపయోగించకూడదు.ఎందుకంటే ప్లాస్టిక్ జెండా భూమిలో కరగదు కనుక ప్లాస్టిక్ తో తయారు చేసిన జెండాలను ఉపయోగిస్తే ఏ ప్రాంతంలో పడితే ఆ ప్రాంతంలో పడిపోయి జాతీయ గౌరవానికి భంగం కలిగించే ప్రమాదం ఉంటుందని పలువురు తెలియజేస్తున్నారు.అలాగే జెండా ఉత్సవం పూర్తి అయిన తర్వాత వెంటనే ఆ జెండాను అక్కడినుంచి తీసేయాలి.
నెలలు, వారాల తరబడి అలానే ఆ జెండాను ఉంచినట్లయితే వాతావరణ మార్పులు, ఇతర కారణాల వల్ల జెండా కింద పడి పోయే అవకాశాలు ఉన్నాయి.ఉత్సవాలు పూర్తి అయిన తర్వాత కాగితపు జెండాను భూమిపై కింద పడకుండా జాగ్రత్తగా వహించాలి.
సాధ్యమైనంత వరకు జాతీయ జెండా కు ఎటువంటి భంగం కలగకుండా ప్రత్యేక ప్రదేశాలలో వాటిని భద్రపరచాలి.అంతేకాకుండా విద్యార్థులలో జాతీయ భావాలను, జాతీయ పతాకం పై ఉన్న గౌరవాన్ని పెంపొందించే విదంగా కార్యక్రమాలు విద్యా సంస్థల వారు నిర్వహించి పిల్లలకు అవేర్నెస్ పెంచాలి.
అంతేకాకుండా జాతీయ జెండా ఎగురవేసే ప్రాంతంలో నియమాలు పాటిస్తున్నారో లేదో అని అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలి.ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
జాతీయ జెండాను ఎవరైనా అవమానించే విధంగా ప్రవర్తిస్తే వారికి మూడు నెలలు జైలు శిక్ష జరిమానా అవకాశాలు చాలానే ఉన్నాయి.