ఖరీదైన కారు కొన్న వెస్డిండీస్ క్రికెటర్

సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతూ ఉంటుంది.వారి చేసే పనులతో పాటు సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు, వీడియోలు.

 West Indies Cricketer Who Bought An Expensive Car Costly,car, Buyyed,andre Russe-TeluguStop.com

ఇలా సెలబ్రెటీలది ప్రతీది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది.ఏ రంగంలో ఉన్న సెలబ్రెటీ అయిన సరే.ఫ్యాన్స్ ఎక్కువమంది ఉంటారు.దీంతో తమ అభిమాన సెలబ్రెటీల అప్డేట్స్ ను అభిమానులు ఫాలో అవుతూ ఉంటారు.

వారు ఏదైనా పోస్ట్ పెట్టినా దానిని లైక్ చేస్తూ కామెంట్స్ పెడుతూ ఉంటారు.దీంతో ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది.

ఇక సినీ సెలబ్రెటీలతో పాటు క్రికెట్ లోని సెలబ్రెటీలకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.అందులో కూడా సూపర్ ఫామ్ లో ఉన్నవారికి మరింతగా అభిమానులు ఉంటారు.

తాజాగా ప్రపంచ క్రికెట్ లో అందరికీ తెలిసిన వెస్డిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.తమ దేశం తరపున ఆడటంతో పాటు ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇటీవల ఐపీఎల్ పూర్తి కావడంతో ఆండ్రీ రసెల్ తన స్వదేశానికి చేరుకున్నాడు.ఈ క్రమంలో ఆండ్రీ రసెల్ అత్యంత ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఏమ్ జీ కారును కొనుగోలు చేశాడు.

ఈ కారులో ప్రయాణిస్తూ తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు.దీంతో అభిమానులు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

వెస్డిండీస్ క్రికెటర్లు కూడా రసెల్ వీడియోపై స్పందించారు.కొత్త కారు కొనుగోలు చేసినందుకు రసెల్‌కు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ తో పాటు ఇతర క్రికెట్లర్రలు శుభాకాంక్షలు తెలిపారు.కాగా రసెస్ కొనుగోలు చేసిన కారు విలువ రూ.2 కోట్లు అని తెలుస్తోంది.ఐపీఎల్ 2022లో రూ.12 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ రసెల్‌ను రిటైన్ చేసుకుంది.గత ఐపీఎల్ లో 13 ఇన్నింగ్స్ లలో 17 వికెట్లు పడగొట్టగా.12 ఇన్నింగ్స్ లలో 335 పరుగులు చేసి ఆల్ రౌండర్ ప్రదర్శన చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube