వెల్కమ్ టు తీహార్ కాలేజ్ చిత్రం సెప్టెంబర్ లో విడుదల

వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “వెల్కమ్ టు తీహార్ కాలేజ్”. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థల్లో విద్య పేరుతో జరుగుతున్న భందిఖానాని అరాచకాన్ని సునిశిత హాస్యంతో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది.

 Welcome To Tihar College Movie Releasing In September Details, Welcome To Tihar-TeluguStop.com

ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ మాసంలో విడుదలకు సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్.

గతం లో శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ, రొమాంటిక్ క్రిమినల్స్ లాంటి యూత్ ఫుల్ ఫిలిమ్స్ లో నటించిన మనోజ్ నందన్ ఈ చిత్రం లో కదా నాయకుడిగా నటిస్తున్నాడు.

ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, సాయినాథ్, మౌనిక బేబీ చిన్నారి, సత్యానంద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.కాలేజీ సి ఈ ఓ గా టి ఎన్ ఆర్ నటించారు.

కాలేజీ లెక్చరర్ల గా ఎఫ్ ఎమ్ బాబాయ్, వెంకట్ రామన్, ప్రసాద్, లెండి హరి తదితరులు నటించారు.ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఐదు యూత్ ఫుల్ పాటలతో మంచి మ్యూజికల్ క్యాంపస్ ఎంటర్టైనర్ గా దీనిని నిర్మించామని నిర్మాతలు తెలియచేసారు.

Telugu Manish, September, Shravya, Sony Reddy, Tihar-Movie

చక్కటి సందేశం తో పాటు యూత్ ను అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో పొందుపరిచామని.కాలేజ్ స్నేహానికి పటం కట్టే ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తన ఆశాభావం వ్యక్తపరిచారు.

నటి నటులు :

మనోజ్ నందన్, ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక, తనీషా, వినయ్ మహాదేవ్, స్టార్ మేకర్ సత్యానంద్, బుగత సత్యనారాయణ, సముద్రం వెంకటేష్, నల్ల శ్రీను, మల్లికా తదితరులు.

చిత్రం పేరు : వెల్కమ్ టు తీహార్ కాలేజ్, బ్యానర్ : శ్రావ్య ఫిలిమ్స్, కెమెరా మాన్ & ఎడిటింగ్ : సాబు జేమ్స్, సంగీత దర్శకుడు : ప్రవీణ్ ఇమ్మడి, కలరింగ్ అమల్, వి ఎఫ్ ఎస్ : శ్యాం కుమార్, పి ఆర్ ఓ : పాల్ పవన్, నిర్మాతలు : డాక్టర్ ఎల్ ఎన్ రావు యెక్కలి రవీంద్ర బాబు, దర్శకుడు : పి సునీల్ కుమార్ రెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube