వైరల్ అవుతున్న 1933 నాటి వివాహ ఆహ్వాన శుభ పత్రిక... అప్పటి టెక్స్ట్ ఎలా వుందో చూడండి!

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో వివాహానికి పెద్ద పీట వేశారు.ఇక సాధారణంగా పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు మనవళ్ల హడావుడి మామ్మూలుగా ఉండదు.

 Wedding Invitation From 1933 Goes Viral,wedding Card,old Wedding Card, Urdu Lang-TeluguStop.com

వివాహ పత్రికలు ముద్రించడం నుండీ కళ్యాణం తంతు ముగిసే వరకు ప్రతిదీ ఎంతో హాట్టహాసంగా నిర్వహిస్తారు.ఈ క్రమంలో డబ్బులు విషయంలో అస్సలు తగ్గరు.

కొంతమంది తమ పెళ్లి పత్రిక విషయమై చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.అందుకే మార్కెట్లో వెడ్డింగ్ కార్డ్స్ బిజినెస్ చేసుకొనేవారు సంఖ్య కూడా బాగా పెరిగింది.10 రూపాయల నుంచి 10 వేల రూపాయల దాకా కార్డులు వున్నాయి అంటే మీరు ఇక అర్ధం చేసుకోవచ్చు.
అలాగే కొందరు వివాహ పత్రికలో అచ్చువేయబడిన మేటర్ విషయంలో కూడా చాలా ఖచ్చితంగా వుంటారు.

ఎక్కడ అచ్చు తప్పులు వున్నా కార్డులు అన్ని రిటన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది.అలాగే కొంతమంది తమ ముత్తాతలనుండి….నేటి తరం వరకు పేర్లను అచ్చు వేస్తూ వుంటారు.ఇందులో ఎవరి ఆనందం వారిది.

ఇది.నేటి పెళ్లి పత్రికల గోల.అయితే మీరు ఎపుడైనా దశాబ్దాల క్రితం నాటి వివాహ పత్రికలు చూస్తే అంత హంగు ఆర్భాటం ఉండదు.చాలా సింపుల్ గా ఉండేవి, చాలా తక్కువ ఖర్చుతో అయిపోయేవి కూడా.ఇంకా కొంతమంది అప్పట్లో చేతి రాతతో రాసినవి పంచేవారని మీకు తెలుసా?

అందుకే అందమైన చేతి రాత కలిగి ఉండడం కూడా అప్పట్లో మంచి సంపాదనను తెచ్చిపెట్టేది.ఇక విషయంలోకి వెళ్తే 1933 నాటి ఒక పెళ్లి పత్రిక ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.సోనాల్ బాట్లా అనే మహిళ తన ట్విట్టర్ ఖాతాలో ఈ పెళ్లి పత్రికను పోస్టు చేయగా అది కాస్త వైరల్ అయింది.అది తన తాతయ్య వివాహ ఆహ్వాన పత్రిక అని ఆమె రాసుకొచ్చింది.

ఇక ఆ పత్రిక ఉర్దూలో అందమైన చేతిరాతతో రాయడం కొసమెరుపు.ఉర్దూ కాలిగ్రఫీతో పాత కాగితంలా ఉంది ఆ పెళ్లి పత్రిక.

ఆ పత్రిక ప్రకారం తండ్రి తన కొడుకు పెళ్లికి ఆహ్వానిస్తున్నట్టుగా రాసింది ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube