అదరగొడుతున్న ఐఫోన్ 15 చిప్‌ సెట్ ఫీచర్!

ఆపిల్ A16 బయోనిక్ చిప్‌ ఉన్న ప్రో మోడల్‌లతో iPhone 14 సిరీస్ గత సంవత్సరం అంటే 2022 ప్రారంభంలో లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే.ఇప్పుడు తాజాగా కుపెర్టినో కంపెనీ ఐఫోన్ 15 సిరీస్ ప్రో మోడల్‌ను దాని కొత్త చిప్‌సెట్ Apple A17తో త్వరలో వస్తోందని తాజాగా ఓ నివేదికలో తెలియజేసింది.

 Apple Iphone 15 To Use 3nm Chipset Built By Tsmc,apple,tsmc,iphone Chipset,a17-TeluguStop.com

ఈ చిప్‌ వలన ఉపయోగం ఏమంటే, మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను అందించడం లక్ష్యంగా దింపుతున్నారు.Apple A17 చిప్‌ను తయారు చేయడానికి TSMC (తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ) 3nm ప్రాసెస్‌ని Apple ఉపయోగించుకునే అవకాశం మెండుగా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆ నివేదిక ప్రకారం 3nm ప్రాసెస్ చిప్‌లు 5nm ప్రాసెస్ చిప్‌ల కంటే మెరుగైన పనితీరును అందిస్తాయని, అదే సమయంలో 35 శాతం తక్కువ పవర్ ని వాడుకుంటామని TSMC ఛైర్మన్ మార్క్ లియు చెప్పుకొచ్చారు. ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్‌లు ఈ 3nm Apple A17 చిప్‌ని కలిగి ఉంటాయని చెబుతున్నారు.

ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌లను సోనీ యొక్క అధునాతన ఇమేజ్ సెన్సార్‌తో కూడా అమర్చవచ్చు.ఈ సెన్సార్ ప్రతి పిక్సెల్‌లో సాధారణ సెన్సార్ కంటే రెట్టింపు సిగ్నల్ స్ట్రెంగ్త్ అందించగలదని భావిస్తున్నారు.

ఇకపోతే భారతదేశంలో అన్ని ఫోన్లకు ఒకే ఛార్జింగ్ పోర్ట్ అనే విషయాలను మనం తరచూ వుంటువున్నాం.అయితే ఈ విషయంలో Apple ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ఎందుకంటే భారతదేశంలో కూడా iPhoneలు లైట్నింగ్ పోర్ట్‌నే సపోర్ట్ చేస్తున్నారు.ఈ కొత్త నియమాలు మారితే, Apple USB టైప్-సికి మారడం తప్ప వేరే మార్గం లేదు.

PTI నివేదిక ప్రకారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ రాబోయే సంవత్సరాల్లో దీనిని అమలు చేయాలని పరిశీలిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube