కాకినాడలో యుద్ధ విమాన మ్యూజియం.. డిసెంబర్ 4న ప్రారంభించనున్న సీఎం జగన్

యుద్ధ విమానం మ్యూజియం కాకినాడ బీచ్ లో త్వరలో ప్రారంభం కానుంది.సంబంధిత పనులు వేగంగా అందుకున్నాయి.

 War Flight Museum In Kakinada .. Cm Jagan To Open On December 4 ,  Kakinada , Wa-TeluguStop.com

సూర్యారావుపేట బీచ్ లో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న పార్కులో కాకినాడ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) నిధులతో టీయూ-142 యుద్ధ విమానం మ్యూజియం ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే.విశాఖపట్నానికి చెందిన తనేజా ఏరోస్పేస్ అండ్ ఏమియేషన్ సంస్థ ఈ పనులు చేపడుతుంది.

ఈ పనులను తూర్పు నౌకాదళం ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ స్వయంగా పరిశీలించారు.ఆయనకు కలెక్టర్ సి.హరికిరణ్, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కుడా ఛైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, వైస్ చైర్మన్ కె.సుబ్బారావు, ఎస్వీ ఎం రవీంద్రబాబు, తదితరులు స్వాగతం పలికారు.యుద్ధ విమానాన్ని పరిశీలించిన వైస్ అడ్మిరల్ అజేంద్ర ప్రజా సందర్శనకు వీలుగా చేపట్టబోయే పనుల గురించి కలెక్టర్ హరికిరణ్, తనేజా సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ ని అడిగి తెలుసుకున్నారు.  విశాఖపట్నంలో మాదిరిగా సందర్శకులు చూసేందుకు ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయాలని సూచించారు.

రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలన్నారు.డిసెంబర్ 4న ప్రారంభోత్సవం జరిగేలా చూడాలన్నారు.

మ్యూజియం, పార్క్ అభివృద్ధి పురోగతి, పెండింగ్ పనులపై సమీక్షించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube