ల్యాప్​టాప్ కొనాలనుకుంటున్నారా? జియో ల్యాప్​టాప్ ట్రై చేయండి, రూ.19వేలే!

మీరు తక్కువ ధరలో ల్యాప్​టాప్ కొనాలనుకుంటున్నారా? అయితే జియో ల్యాప్​టాప్ ట్రై చేయండి.రిలయన్స్‌ జియో తాజాగా తన మొట్టమొదటి ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది.జియో బుక్‌గా వ్యవహరించే దీనిని గవర్నమెంట్‌ ఇ-మార్కెట్‌ప్లేస్‌ (GEM) పోర్టల్‌లో రూ.19,500 ఆఫర్‌ ధరకు విక్రయిస్తున్నారు.ప్రస్తుతానికి ఇది GEM పోర్టల్‌లోనే అందుబాటులో ఉంది.అందువల్ల అందరూ దీనిని కొనే వీల్లేదు.కేవలం ప్రభుత్వ విభాగాలు మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.దీపావళి నాటికి సాధారణ ప్రజానీకానికి కూడా దీనిని అందుబాటులోకి తెచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

 Want To Buy A Laptoptry Jio Laptop, Rs 19,000, Laptap, Good News, Technology New-TeluguStop.com

అయితే ధర ఇంతే ఉంటుందా? లేదా? పెంచుతారా అనేది వేచి చూడాలి.కాగా.ఇప్పటికే ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌- 2022లోనూ జియో బుక్‌ను ప్రదర్శించారు.5జీ సేవలపై తుది ప్రయోగాత్మక ప్రక్రియ (బీటా ట్రయల్‌)ను 4 నగరాలు… దిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసిలో బుధవారం (అక్టోబరు 5) ప్రారంభించనున్నట్లు రిలయన్స్‌ జియో తెలిపింది.ఎంపిక చేసిన వినియోగదారులపై దీనిని చేపట్టనుంది.తమ 5జీ సేవలను ప్రయత్నించాల్సిందిగా.‘జియో ట్రూ 5జీ వెల్‌కమ్‌ ఆఫర్‌’ కింద వినియోగదారులను కంపెనీ ఆహ్వానించనుంది.

జియో ల్యాప్​టాప్ ఫీచర్స్ ఇవే:

1.11.6 అంగుళాల హెచ్‌డీ ఎల్‌ఈడీ బ్యాక్‌లిట్‌ యాంటీ-గ్లేర్‌ తెర, నాన్‌టచ్‌.
2.రిజల్యూషన్‌ 1366X767 పిక్సెల్స్‌క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో కూడిన ఈ జియో బుక్‌.
3.జియోఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా పనిచేస్తుంది.
4.2 జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది.ర్యామ్‌ను పెంచుకునే సదుపాయం లేదు.
5.USB 2.0 పోర్ట్‌, 3.0 పోర్ట్‌, హెచ్‌డీఎంఐ పోర్ట్‌ ఉన్నాయి.యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్స్‌ ఇందులో లేవు.
మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్‌ కలదు.
6.బ్లూటూత్‌, 4జీ మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీకి వీలుంది
.7.రెండు ఇంటర్నల్‌ స్పీకర్లు, మైకోఫోన్లు ఉన్నాయి.
8.ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ లేదు.
9.55.1- 60ఏహెచ్‌ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ.1.2 కిలోల బరువు.
10.సంవత్సరం బ్రాండ్‌ వ్యారెంటీ

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube