అమెరికా : గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు గుడ్ న్యూస్...!!!

ప్రపంచంలో శాశ్వత నివాసం కోసం జారీ చేయబడే వీసాలలో గ్రీన్ కార్డ్ కు భారీ డిమాండ్ ఉంటుంది.అమెరికా అందించే ఈ గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ళ తరబడి కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్న ప్రవాసులు లక్షల మంది ఉన్నారు.

 America: Good News For Green Card Holders , America, Green Card Holders, Green C-TeluguStop.com

ముఖ్యంగా వీరిలో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉంది.కాగా తాజాగా గ్రీన్ కార్డ్ జారీలో ఆలస్యం ఉండదని అమెరికాలో హెచ్ -1బి వీసా పై 7 ఏళ్ళు ఉన్న నిపుణులు ఎవరైతే ఉంటారో వారు గ్రీన్ కార్డ్ పొందేందుకు అర్హులుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన అమెరికా తాజాగా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు గుడ్ న్యూస్ తెలిపింది.

అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉండి వాటి రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారుల గ్రీన్ కార్డ్ కాలపరిమితిని ఆటోమేటిక్ గా పొడిగించినట్టుగా అమెరికా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. గ్రీన్ కార్డ్ రెన్యువల్ చేసుకునే వారు I-90 ఫార్మేట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దీనికోసం ప్రాసెసింగ్ ఫీజు కొంత చెల్లించాల్సి ఉంటుంది.అమెరికా సిఐఎస్ వెబ్సైటు లో గ్రీన్ కార్డ్ రెన్యువల్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో రెన్యువల్ కోసం వెయిటింగ్ పిరియడ్ ఎంత సమయం పడుతుందో వెబ్సైటు లో చూసి తెలుసుకోవచ్చును.ఇదిలాఉంటే

2021 ఏడాదికిగాను సుమారు 93 వేల మందికిపైగా గ్రీన్ కార్డ్ లు పొందగా కంపెనీలు స్పాన్సర్ చేసిన ప్రవాసులు గ్రీన్ కార్డ్ పొందేందుకు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మరో 3 ఏళ్ళు పట్టవచ్చునని తెలుస్తోంది.ఈ క్రమంలో వారి వెయిటింగ్ పిరియడ్ 7 నెలలు తగ్గాలంటేఅదనపు రుసుము కింద 2500 డాలర్లు చెల్లించాల్సి వస్తుంది.కాగా బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత వీసాల జారీ విషయంలో కానీ గ్రీన్ కార్డ్స్ జారీ లో జాప్యం తగ్గించి ఏళ్ళ తరబడి శాశ్వత నివాసం కోసం వేచి చూస్తున్న ప్రవాసులకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

ముఖ్యంగా భారతీయ ప్రవాసులకు బిడెన్ తీసుకుంటున్న చర్యలు కలిసి వస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube