ఓవర్సీస్ లో 'ధమ్కీ' చూయిస్తున్న విశ్వక్ సేన్.. మాసివ్ ఓపెనింగ్స్ తో కుమ్మేసాడు!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) ఒకరు.ఈయన తాజాగా నటించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’(Dhamki).

 Vishwak Pulls Decent Number With Dhamki Details, Vishwak Sen, Das Ka Dhamki, Dha-TeluguStop.com

విశ్వక్ సేన్ హీరోగా, నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) హీరోయిన్ గా విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ధమ్కీ.ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు అయితే ఉన్నాయి.

ఇక మేకర్స్ చేసిన ప్రమోషన్స్ ఈ సినిమాను భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యేలా చేసాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏకంగా ఎన్టీఆర్ (NTR) ను తీసుకువచ్చి మేకర్స్ ప్రమోషన్స్ చేయించడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి.

ఇక లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు కుమార్ బెజవాడ డైలాగ్స్ రాసారు.వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ పై సంయుక్తంగా కరాటే రాజు నిర్మించారు.

ఎప్పటి నుండో రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 22న రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా తెలుగు వర్షన్ కు మాత్రమే కాదు తమిళ్ వర్షన్ లో కూడా మంచి వసూళ్లు నమోదు చేసినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి.ఇక విశ్వక్ సేన్ ధమ్కీ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లనే రాబట్టింది.అలాగే ఈ సినిమా ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యిన విషయం తెలిసిందే.

మరి ఈ సినిమా యూఎస్ లో కూడా మంచి నంబర్స్ నమోదు చేసిందట.

తాజాగా మేకర్స్ ఈ విషయాన్నీ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అండ్ మొదటి రోజు వసూళ్లు కలిపి 150K డాలర్స్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తుంది.దీంతో యూఎస్ లో ఈ సినిమా ఈ వీకెండ్ కు మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

చూడాలి మొత్తం మీద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube