వైరల్: టమాటాలకు కాపలా వున్న నాగరాజు... ముట్టుకుంటే కాటేస్తానంటోంది!

సోషల్ మీడియా( Social media)లో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం వేరే లెవల్ అని చెప్పుకోక తప్పదు.విషయంలోకి వెళ్ళిపోతే దాదాపు నెల రోజుల క్రితం కిలో రూ.20కి లభించే టమాటా ఇప్పుడు రూ.250కి చేరి యాపిల్ పండ్ల కంటే కూడా ఖరీదైనదిగా మారింది అతిశయోక్తి లేదు.ప్రస్తుతం టమాటా కొనాలంటే సామాన్యుడికి గుండెపోటు వచ్చే పరిస్థితి వుంది.

 Viral: Cobra Guarding Tomatoes Says That He Will Bite If You Touch Him! Tomato,-TeluguStop.com

దీంతో ఇప్పుడు చాలాచోట్ల టమాటా దొంగలు అధికంగా పెరిగిపోతున్నారు.తోటలు, దుకాణాల్లో చొరబడి టమాటా పంటను చోరీ చేస్తున్నారని మనం రోజూ వార్తల్లో వింటూ వున్నాం.

అదంతా ఒకెత్తయితే ఏపీలో టమాటా రైతు హత్యకు గురికావడం మరొక ఎత్తు.దీంతో చాలా చోట్ల టమాటా పంటకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు రైతులు.ఇపుడు మాట్లాడుకోబోయే విషయం కూడా అలాంటిదే.టమాటాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో టమాటాలకు కాపలాగా ఓ భారీ నాగుపాము ( Cobra )కూర్చుని ఉండడం గమనించవచ్చు.వీడియో పడగ విప్పిన నాగుపాము టమాటాలకు కాపు కాస్తున్నట్టుగానే కనిపిస్తోంది.

ఓ వ్యక్తి టమాటాలు తీసుకునే ప్రయత్నం చేయటం కూడా వీడియోలో కనిపిస్తుంది.కానీ, పాము వెంటనే పడగవిప్పి కాటు వేయడానికి యత్నించింది.

కాగా ఈ వీడియోని చూసిన నెటిజన్లు తమకు నచ్చిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.కొంతమంది “టమాటా ఇపుడు ఒక గొప్ప నిధితో సమానం.అందుకే దానికి నాగబంధం వుంది!” అంటూ కామెట్స్ చేస్తున్నారు.మరికొంతమంది అయితే “టమాటాకు కాపలాగా కాలనాగు” అని కామెంట్ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు.ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్‌( Madhya Pradesh )లోని అశోక్‌ నగర్‌లో ఓ దుకాణదారుడు మొబైల్ ఫోన్ కొనుగోలుతో పాటు 2 కిలోల టమోటాలను బహుమతిగా అందించే పథకాన్ని ప్రారంభించి వార్తల్లోకెక్కిన విషయం విదితమే.ఇక మీరు కూడా ఈ వీడియోని తిలకించి మీమీ అభిప్రాయాలను తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube