సోషల్ మీడియాలో కొన్ని కొన్ని సార్లు వైరల్ అవుతున్న వీడియోలు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంటాయి.తాజాగా వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే అలాగే అనిపిస్తుంది.
ఇక బ్యాడ్మింటన్( Badminton )కు ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రేజ్ గురించి ఇక్కడ ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన పనిలేదు.మనలో చాలామందికి ఇది ఈవెనింగ్ అలా సరదాగా అదే ఆట.ఇంకా మీరు ఎన్నో మ్యాచ్‌లు చూసి ఉంటారు.కాని పిల్లులు బ్యాడ్మింటన్ ఆడటం( Cats playing badminton ) ఎప్పుడైన చూశారా? చూడకపోతే మీరు ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే.
ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఒక్కసారి గమనిస్తే అందులోని వ్యక్తి ఒకేసారి మూడు పిల్లులతో బ్యాడ్మింటన్ ఆడుతున్న అందమైన దృశ్యాలను చూడవచ్చు.కాగా ఈ బ్యాడ్మింటన్ ఆడిన వీడియో ప్రస్తుతం వైరవుతోంది.లియన్ షార్ట్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు ఈ వీడియోను షేర్ చేయగా అది కాస్త వెలుగు చూసింది.ఆ వ్యక్తి తన చేతిలో బ్యాడ్మింటన్ రాకెట్‌ను పట్టుకుని ఉండగా.
అతని ఎదురుగా మూడు పిల్లులు మేము ఆడడానికి రెడీ అన్నారు చూస్తున్నాయి.అందులో ఓ పిల్లి డస్ట్‌బిన్ పై కూర్చోగా మరో రెండు పిల్లులు కింద ఉన్నాయి.
ఇక సదరు వ్యక్తి బ్యాడ్మింటన్ రాకేట్‌తో కాక్‌ని కొట్టగానే డస్ట్‌బిన్ పై కూర్చున్న పిల్లి.దాని చేతులతో దాన్ని కొడుతుంది.దీంతో కింద ఉన్న పిల్లి చేతికి ఆ కాక్ అందకపోయినప్పటికీ ఎగిరి మరీ కాళ్లతో చాలా చాకచక్యంగా తన్నుతుంది.ఆ తరువాత దానికి అటు పక్కాగా వున్న పిల్లి దానిని మరలా కొట్టే ప్రయత్నం చేస్తుంది.
కాగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఐతే తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.మనుషులు కంటే పిల్లులు బాగా బ్యాడ్మింటన్ ఆడుతున్నాయని కొందరు కామెంట్స్ చేసారున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.