హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు కలకలం సృష్టించాయి.హైదరాబాద్ నగరం కేంద్రం ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.ఇందులో భాగంగా సుమారు 16 మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది.
వీరిలో భోపాల్ కు చెందిన పదకొండు మంది ఉండగా.హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు ఐదుగురు ఉన్నట్లు సమాచారం.
అనంతరం అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి ఫోన్లు, ల్యాప్ టాప్, కత్తులతో పాటు ఇస్లామిక్ జిహాదీ సాహిత్యాన్ని సీజ్ చేశారు.