వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మొబైల్ ఫోన్ పోయిందని ఆయన వ్యక్తిగత సహాయకుడు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఆ ఫోన్ సంబంధించిన నెంబర్ వాడటం లేదు.అతని వ్యక్తిగత సహాయకుడు దానిని ఉపయోగిస్తున్నాడు.
అలాగే దీనిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఫిర్యాదుదారు కోరారు.దీంతో ఈ కేసు విచారణలో ముందుకు వెళ్లలేదు’ అని పోలీసులు చెబుతున్నారు.
పోగొట్టుకున్న ఫోన్ ఎక్కడుందో కనుక్కోవడం పోలీసులకు కష్టమేమీ కాదు.టవర్ లొకేషన్, IMEI నంబర్ మరియు ఇతర టెక్నాలజీల ఆధారంగా, ఫోన్‌ని ఎక్కడినుంచైనా ట్రాక్ చేయవచ్చు.
ముఖ్యంగా ఫిర్యాదుదారు అధికార పార్టీకి చెందిన ఎంపీ కావడంతో చాలా సులభంగా ట్రాక్ చేయవచ్చు.అయితే పోలీసులు కేసును విచారిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌చంద్రారెడ్డిని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు.ఈ కేసులో 36 మంది అనుమానితులులు గత ఏడాది 170 సెల్‌ఫోన్‌లను ధ్వంసం చేశారని ఈ కేసులో ఇటీవల ఛార్జ్ షీట్‌లో ED పేర్కొంది.
విజయసాయిరెడ్డి విషయంలోనూ ప్రతిపక్షాలు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

నిజంగానే ఈ ఫోన్‌లో ఆ స్కామ్ సంబంధించిన ఏదైన డెటా ఉందా అని వైసీపీ నేతల్లో కూడా చర్చ మెుదలైంది.అయితే తాజా సమాచారం ప్రకారం అందులో శరత్‌చంద్రారెడ్డి కాల్స్ డెటా ఉన్నట్లు తెలుస్తుంది.విజయసాయి రెడ్డికి ఆయన పలు సార్లు ఫోన్ చేసినట్లుగా సమాచారం.
ఈ కేసులో తను తప్పిచుకునే మార్గాల్లో భాగంగా విజయసాయిని శరత్‌చంద్రారెడ్డి సహయం కోరినట్లుగా తెలుస్తోంది.అయితే తను ఈ విషయంలో ె ఎలాంటి సహయం చేయలేనని విజయసాయి.
శరత్‌కు వివరించారట.