రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే బాలీవుడ్ హీరోయిన్స్ కి సూపర్ క్రేజ్.అందుకే అక్కడ భామలంతా కూడా విజయ్ మీద తమ ఇష్టాన్ని తెలుపుతుంటారు.
అర్జున్ రెడ్డి సినిమాలో అతని నటన చూసి అందరు ఫిదా అయ్యారు.ఆ ఇమేజ్ తోనే లైగర్ ని పాన్ ఇండియా రిలీజ్ చేశారు.
అయితే అది కాస్త డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా విజయ్ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
ఇక అదే క్రేజ్ తో వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తున్నాడు విజయ్.
ప్రస్తుతం విజయ్ కియరా అద్వానితో కలిసి సెరా శానిటరీ థింగ్స్ కోసం చేసిన యాడ్ లో నటించారు.
ఆ యాడ్ లో కియరాకి రెడ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు విజయ్ దేవరకొండ.ఈ ఇద్దరి జోడీ చాలా బాగుంది.కచ్చితంగా రానున సినిమాల్లో ఈ జోడీని సినిమాలో ఫిక్స్ చేస్తారని చెప్పొచ్చు.విజయ్ ప్రస్తుతం ఖుషి సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్, సమంతల మధ్య లవ్ సీన్స్ క్రేజీగా ఉండబోతాయని టాక్.