గూగుల్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది.వర్క్‌స్పేస్ వినియోగదారుల కోసం కంపెనీ స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుతోంది.
అంటే రాబోయే కాలంలో గూగుల్ వర్క్ స్పేస్ వ్యక్తిగత ఖాతా 15GB స్టోరేజ్‌కు బదులుగా 1TB సురక్షిత క్లౌడ్ స్టోరేజ్‌తో వస్తుంది.దీని కోసం మీరు ఎటువంటి సెట్టింగులు ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు.
అన్ని ఖాతాలు ఆటోమేటిక్‌గా 15GB నుండి 1TB స్టోరేజీకి మార్చబడతాయి.గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో దీని గురించి సమాచారాన్ని ఇచ్చింది.
వర్క్‌స్పేస్ వ్యక్తిగత వినియోగదారుల కోసం మరిన్ని ఫీచర్‌లు విడుదల చేయనున్నట్లు కంపెనీ బ్లాగ్ పోస్ట్ పేర్కొంది.అంతే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
గూగుల్ వర్క్ స్పేస్ (గతంలో జీస్యూట్) క్లౌడ్ ఆధారిత ఉత్పాదకత సూట్‌గా సేవలు అందించింది.
ఇది వ్యక్తిగత వినియోగదారులు, కార్యాలయ బృందాలు ఏ గ్యాడ్జెట్ ద్వారా అయినా, ఎక్కడి నుండైనా పని చేయడానికి వీలుగా ఉంటుంది.ప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్ల మంది వినియోగదారులు గూగుల్ వర్క్ స్పేస్ కోసం గూగుల్‌కు చెల్లింపులు చేస్తున్నారు.
ఇందులో గత రెండేళ్లలో 2 మిలియన్ల కస్టమర్లు అదనంగా చేరారు.
కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగులు పని చేయడంతో అదనంగా కస్టమర్లు చేరినట్లు తెలుస్తోంది.మీరు గూగుల్ వర్క్ స్పేస్ వినియోగిస్తుంటేనే ఈ ఫీచర్ మీకు ఉపయోగపడుతుంది.గూగుల్ వర్క్ స్పేస్‌ని ఉపయోగించడానికి, కంపెనీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలి. ప్లాన్ ధర నెలకు రూ.125 నుండి ప్రారంభమవుతుంది.మల్టీ-సెండ్ మోడ్ ఫీచర్‌ను కూడా లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.స్టోరేజీని అప్‌గ్రేడ్ చేయడానికి ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు.కంపెనీ స్టోరేజీని ఆటోమేటిక్‌గా 1TBకి పెంచుతుంది.