డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తాజాగా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.తమిళ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా పలు చోట్ల మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ మరికొన్ని చోట్ల కలెక్షన్ల పరంగా మాత్రం భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో డైరెక్టర్ లోకేష్ సైతం థియేటర్లను సందర్శిస్తున్నారు.
ఇకపోతే ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి లోకేష్ ఈ సినిమా గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు.
ఈ సందర్భంగా లోకేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజానికి తాను ఈ సినిమా హీరో విజయ్( Vijay ) ని దృష్టిలో పెట్టుకొని సినిమా కథ రాయలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ సినిమా కథ తాను ఐదు సంవత్సరాల క్రితమే వేరొక హీరోని దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేశాను.అయితే కొన్ని కారణాలవల్ల ఆ హీరో ఈ సినిమాలో నటించలేకపోయారు.ఇక తాను విజయ్ తో కలిసి మాస్టర్ సినిమా ( Master Movie ) చేసే సమయంలో ఆయన నటన సామర్థ్యాలను ఎలివేట్ చేయడానికి ఆయనతో కలిసి లియో సినిమా( Leo Movie ) చేశాను అంటూ ఈయన షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
ఈ విధంగా డైరెక్టర్ లోకేష్ డియో సినిమా గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.హీరో విజయ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాయలేదు అని చెప్పినటువంటి ఏ హీరోను ఊహించుకొని ఈ సినిమా కథ రాశారు అనే విషయాన్ని మాత్రం ఈయన వెల్లడించలేదు.ఏది ఏమైనా ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలతో ఉన్నటువంటి విజయ్ అభిమానులకు ఎక్కడో చిన్న అసంతృప్తి అయితే నెలకొందనే విషయం తెలుస్తుంది.ఇక ఈ సినిమా దసరా పండుగ సందర్భంలో విడుదల కావడంతో సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన కలెక్షన్స్ మాత్రం సినిమాని బయటపడే సాయని చెప్పాలి.