అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమా ద్వారా ఒక్కసారిగా ఎంతో ఫేమస్ అయ్యారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ).ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.
దీంతో ఈయన క్రేజ్ పెరిగి పోవడమేకాకుండా కాస్త యాటిట్యూడ్ కూడా చూపించారు.అయితే దీనిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ లైగర్ సినిమా(Liger Movie) విడుదల సమయంలో మాత్రం ఈయన కాస్త ఓవరాక్షన్ చేశారని చెప్పాలి.
ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన ఏ సినిమా ఈవెంట్ కు వెళ్లిన విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ చూపిస్తూ అంతే గర్వంగా సమాధానాలు కూడా చెప్పేవారు.
ఈ విధంగా లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.అయితే ఇదంతా సినిమాపై హైప్ పెంచడం కోసమే చేశారని పలువురు చెప్పినప్పటికీ ఈ సినిమా విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో విజయ్ దేవరకొండపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.ఇప్పటివరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎవరు కూడా ఇలాంటి యాటిట్యూడ్ చూపించలేదనీ పెద్ద ఎత్తున ఈయనని విమర్శించారు.
అంతేకాకుండా ఈ యాటిట్యూడ్ కాస్త తగ్గించుకుంటేనే ఇండస్ట్రీలో మనుగడ ఉంటుంది అంటూ భారీ స్థాయిలో ఈయనపై విమర్శలు కురిపించారు.ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ కొంత కాలం పాటు మీడియాకు అలాగే సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నారు.ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండ తాజాగా తన తమ్ముడు నటించిన బేబీ సినిమా( Baby Movi e) సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఈయన చాలా పద్ధతిగా ఎంతో మర్యాదపూర్వకంగా అందరికీ గౌరవం ఇస్తూ మాట్లాడటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అసలు ఇక్కడ ఉన్నది విజయ్ దేవరకొండనేనా అంటూ ఆశ్చర్య వ్యక్తం చేశారు లైగర్ ఫ్లాప్ తర్వాత ఈయన తన యాటిట్యూడ్ మొత్తం పక్కన పెట్టారని తెలుస్తోంది.ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడినటువంటి స్పీచ్ ప్రస్తుతం వైరల్ గా మారింది.