రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ లైగర్ అంటూ గురువారం ప్రే|క్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా మొదటి రోజు టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు ఉన్నాయి.
పూరీ జగన్నాథ్, విజయ్ కాంబో అనగానే లైగర్ మీద ఎక్కడ లేని అంచనాలు ఏర్పడ్డాయి.ఈ క్రమంలో సినిమా రిలీజ్ కు వారం ముందే వీకెండ్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి.
ఇక ఫస్ట్ డే తెలుగు రెండు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ కెరియర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు.లైగర్ సినిమా ఫస్ట్ డే 9.60 కోట్లు షేర్ రాబట్టింది.
స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో లైగర్ వసూళ్లు ఉండటం విశేషం.
తెలుగు రెండు రాష్ట్రాల్లో కలిపి లైగర్ సినిమా 55 కోట్లకు అమ్ముడయ్యింది.మొదటిరోజు వసూళ్లు అదరగొట్టగా సినిమాకు వచ్చిన టాక్ తో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో చూడాలి.
పూరీ డైరక్షన్ కథ కథనాలు ఎలా ఉన్నా సినిమా కోసం విజయ్ పడిన కష్టం మాత్రం తెర మీద కనిపిస్తుందని చెప్పొచ్చు.మరి రౌడీ ఫ్యాన్స్ ఈ సినిమాని హిట్ చేస్తారో లేదో చూడాలి.
సినిమాపై అంచనాలు ఎక్కువవడంతో మొదటి ఆటకే నెగటివ్ టాక్ వచ్చేసింది.మరి దాన్ని దాటుకుని సినిమా వసూళ్లు రాబడుతుందా లేదా అన్నది చూడాలి.