మునుగోడు కాంగ్రెస్ లో ఆ నలుగురు ! వీరిలో అభ్యర్థి ఎవరు ?

మునుగోడు కాంగ్రెస్ లో ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త చక్కబడుతున్నట్టుగా కనిపిస్తోంది.ఇక్కడ త్వరలో అసెంబ్లీ ఉప ఎన్నికలు రాబోతూ ఉండడం తో,  అన్ని ప్రధాన పార్టీలు గెలుపు పై దృష్టి పెట్టి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టాయి.

 Who Will Be The Candidate For Congress Munugode By Polls Details, Munugodu Elect-TeluguStop.com

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి,  పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివారిమయ్యాయి.బిజెపి తరఫున రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుండగా,  టిఆర్ఎస్ ,కాంగ్రెస్ లు మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.

దీనిపైన పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు.అభ్యర్థిని ప్రకటించకపోయినా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ను మోహరించారు.

ఈ నియోజకవర్గ కేంద్రంగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ, తమ పార్టీ గెలుపుకు డోకా లేకుండా చేసుకుంటున్నారు.చిన్నచిత నాయకులు నుంచి జాతీయస్థాయి నాయకులు వరకు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలపై నే ప్రధానంగా దృష్టి సారించారు.

ముఖ్యంగా కాంగ్రెస్ లో ఈ టెన్షన్ ఎక్కువగా ఉంది.తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ దక్కించుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది.ఈ సందర్భంగా గ్రూపు రాజకీయాలు తెరపైకి వచ్చినా, పరిస్థితిని చక్కదిద్దుకుంటూనే గెలుపుకు డోకా లేకుండా చేసుకునే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నాయి.మొన్నటి వరకు తాను ఎన్నికల ప్రచారానికి వచ్చేదే లేదు అంటూ బహిరంగ ప్రకటన చేసిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనసు మార్చుకున్నారు.

తాను ఎన్నికల ప్రచారానికి వెళ్తానని ప్రకటించారు.ఇక కాంగ్రెస్ నలుగురు అభ్యర్థుల జాబితా సిద్ధమైనట్లు సమాచారం.

దీనిని పిసిసి నేడు రేపు ఏఐసిసికి సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం రెండు రోజులుగా హైదరాబాద్ లో జరిగిన ఆశావాహుల గుర్తింపు ప్రక్రియ నిన్నటితో ముగియడంతో , మునుగోడు లో వాస్తవ పరిస్థితి ఏమిటి? ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని అనేక అంశాలపై కాంగ్రెస్ తెలంగాణ వ్యూహకర్త సునీల్ కానుగోలు సర్వే నివేదిక తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Telugu Keishna, Congress, Kailash, Komatirajagopal, Munugodu, Pcc, Ravikumar Gou

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ తో పాటు , తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క,  మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డిలు అభ్యర్థులు ఎంపికపై కీలకంగా చర్చించారు.మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ప్రధానంగా ఆసక్తి చూపిస్తున్న కాంగ్రెస్ నేతలు పాల్వాయి స్రవంతి, సిహెచ్ కృష్ణారెడ్డి,  పల్లె రవికుమార్ గౌడ్, కైలాష్ నేతలతో నిన్న రేవంత్ రెడ్డి దామోదర్ రెడ్డి విడివిడిగా సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా టికెట్ ఇస్తే ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు ? ఎంత ఖర్చు పెడతారు ? మీకు కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తే వారు గెలుపు కోసం మీరు పని చేస్తారా లేదా ? ఇలా అనేక అంశాలపై ప్రత్యేకంగా ఒక్కో అభ్యర్థిని ఆరా తీసినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ నలుగురిలోనే ఒకరిని కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థిగా ఎంపిక చేసే ప్రక్రియపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube