సినీ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ( Vijay Deverakonda )ఒకరు కెరియర్ మొదట్లో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఉన్నటువంటి విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.మొదట సినిమాతోనే మంచి సక్సెస్ కావడంతో ఈయన అనంతరం వరస సినిమా అవకాశాలను అందుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా గుర్తింపు పొందారు.
ఇక ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.ఈ క్రమంలోనే ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని ఈయన తపన పడుతున్నారు.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.గీతగోవిందం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించినటువంటి డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో మరోసారి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటించారు.
ఈ సినిమాలో ఈయనకు జోడిగా మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) నటించారు.
ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెట్టించిన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.గత కొద్దిరోజులుగా ఈయన పెళ్లి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.
తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ తనకు తండ్రి కావాలని ఉందని, తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని అది కూడా ప్రేమ వివాహమే( Love Marriage ) చేసుకుంటానని తెలిపారు.నేను చేసుకోబోయే అమ్మాయి తన తల్లిదండ్రులకు కూడా నచ్చుతుందని ఈయన తెలిపారు.
ఇక ఈయన మాటలను బట్టి చూస్తుంటే రష్మిక( Rashmika Mandanna )నే ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.