పెళ్లి తర్వాత గొడవలు 'ఖుషి'... కొత్తదనం ఏముంది భయ్యా?

విజయ్ దేవరకొండ ( vijay devarakonda )హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాన ( Shiva Nirvana )దర్శకత్వం లో రూపొందుతున్న ఖుషి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

 Vijay Devarakonda And Samantha Kushi Movie Trolls , Vijay Devarakonda , Samanth-TeluguStop.com

సినిమా ను సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో సమంత మరియు విజయ్ దేవరకొండ పాల్గొంటున్నారు.

Telugu Kushi, Samantha, Shiva Nirvana, Tollywood-Movie

శివ నిర్వాన గతంలో రూపొందించిన సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ కొందరు నమ్ముతున్నారు.అయితే కొందరు మాత్రం ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా ను ఇతర సినిమా లతో పోల్చుతూ విమర్శిస్తున్నారు. ఖుషి సినిమా ( Kushi movie )గతంలో వచ్చిన పెళ్లి తర్వాత గొడవల సినిమాల మాదిరిగానే ఉండబోతుంది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Kushi, Samantha, Shiva Nirvana, Tollywood-Movie

పెళ్లి తర్వాత గొడవలు పడే భార్య భర్తల కథ తో చాలా సినిమా లే వచ్చాయి.కనుక ఈ సినిమా ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సోషల్‌ మీడియాలో ఈ సినిమా కు మెజార్టీ గా పాజిటివ్‌ టాక్ వినిపిస్తుంది.విడుదలకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని పెంచే విధంగా మరింత హడావుడి చేయాల్సిన అవసరం ఉంది.

శివ నిర్వాన ఈ రొటీన్‌ కాన్సెప్ట్‌ ను తప్పకుండా మంచి కథ తో రూపొందించి ఉండి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సమంత మరియు విజయ్ దేవరకొండ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఇది సమంత ఇచ్చిన కథ అంటూ కూడా కొందరు ప్రచారం చేస్తున్నారు.అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube