తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ లాంటి నటుడు మరొకరు లేరనే చెప్పాలి.ఈయన చేసిన సినిమాలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉంటాయి.
నిజానికి ఆయన దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన వేట్టయన్ సినిమా ( vettaiyan )తెలుగులో యావరేజ్ గా ఆడినప్పటికి ప్రస్తుతం ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ చూస్తుంటే మాత్రం చాలా వరకు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నష్టపోయారనే చెప్పాలి.ఇక జ్ఞానవేల్ ( TJ Gnanavel )దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్ గా ఉన్నప్పటికీ ఆ ప్లాట్ పాయింట్ ఓల్డ్ టెంప్లెట్ లోసాగుతుంది.
అందువల్ల ఈ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
నిజానికి రజనీకాంత్( Rajinikanth ) లాంటి నటుడు సినిమాలో ఉన్నప్పుడు ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తీస్తే సరిపోయేది అలా కాకుండా దర్శకుడు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను తీయడంతో రజనీకాంత్ ఎంతసేపటికి ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటాడు తప్ప సినిమాకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ని చేయడంలో కొంతవరకు వెనకడుగు వేశాడు.అందువల్లే ఈ సినిమాకి సక్సెస్ అనేది రాలేదు.మరి మొత్తానికైతే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించే రజనీకాంత్ ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన వేసిన అంచనాలు తారుమారు అయ్యాయనే చెప్పాలి.
ఇక తెలుగుతో పాటు తమిళంలో కూడా భారీ నష్టాలను మిగిల్చిందనే చెప్పాలి.ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న కూలీ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు.ఆ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు…ఇక రజినీకాంత్ లాంటి నటుడు ఇప్పుడు వరుస సినిమాలు చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…
.