తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు దగ్గుబాటి వెంకటేష్( Venkatesh ) ఒకరు.ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించినటువంటి వెంకటేష్ చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సొంతం చేసుకున్నారు.
ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఇక వెంకటేష్ వృత్తి పరమైన జీవితం కాకుండా వ్యక్తిగత విషయానికి వస్తే… ఈయనకు నలుగురు సంతానం అనే విషయం మనకు తెలిసిందే ముగ్గురు అమ్మాయిలు కాగ ఒక అబ్బాయి ఉన్నారు.
ఇప్పటికే వెంకటేష్ తన పెద్ద కుమార్తెకు వివాహం చేశారు.ఇక తాజాగా తన రెండవ కుమార్తె హయవాహిని( Hayavahini ) కి కూడా నిశ్చితార్థం జరిపించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా వెంకటేష్ తన రెండవ కుమార్తె విజయవాడకు చెందినటువంటి ప్రముఖ డాక్టర్ కుటుంబానికి కోడలుగా పంపిస్తున్నారు.సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కాకుండా డాక్టర్ బాబుని తన అల్లుడిగా చేసుకుంటున్నారు వెంకటేష్.ఈ క్రమంలోనే వెంకటేష్ కు కాబోయే అల్లుడు ఎవరు తన బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వెంకటేష్ రెండవ అల్లుడిగా రాబోతున్నటువంటి వ్యక్తి పేరు ఆకాష్( Aakash )
ఈయన కుటుంబం మొత్తం వైద్య వృత్తిలో( Doctor ) స్థిరపడ్డారు.వీరికి విజయవాడలో హాస్పిటల్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.ఇకపోతే వెంకటేష్ కి కాబోయే అల్లుడు దేశంలోనే టాప్ టెన్ గైనకాలజిస్టులో( Gynecologist ) ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.ఈయన తన వైద్య వృత్తిలో ఎంత పేరు ప్రఖ్యాతలను సంపాదించుకొని టాప్ టెన్ డాక్టర్స్ లో ఒకరిగా స్థిరపడ్డారు ఇక ఈయన సంపాదన కూడా నెలకు కోట్లలోనే ఉంటుందని తెలుస్తోంది.
ఏది ఏమైనా కూతురి జీవితం గురించి ఆలోచించి వెంకటేష్ భారీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్( Family Background ) ఉన్నటువంటి కుటుంబానికి తన కుమార్తెను కోడలుగా పంపుతూ తండ్రిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారని తెలుస్తుంది.