మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాడు.వరుణ్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సంపాదించు కున్నాడు.
ముందు నుండి డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటూ కెరీర్ లో మినిమమ్ హీరోగా తనని తాను నిలబెట్టుకున్నాడు.
ఇక ప్రజెంట్ ఈయన రెండు సినిమాలు లైన్లో పెట్టుకున్నాడు.మరి ఆ సినిమాల్లో వరుణ్ తేజ్ ”ఆపరేషన్ వాలెంటైన్”( Operation Valentine ) ఒకటి.నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా ఈ సినిమాను నూతన డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు.భారత వాయుదళ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది.ఇండియా ఇప్పటి వరకు చూడని అతి పెద్ద, భయంకరమైన వైమానిక దాడులని చూపించ నున్నారట.
తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయ్యింది.ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్( VFX Works ) వేగంగా పూర్తి చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబందించిన అన్ని భాషల నాన్ థియేట్రికల్ రైట్స్( Operation Valentine Non Theatrical Rights ) ను ఏకంగా 50 కోట్ల భారీ ధరకు అమ్ముడు పోయినట్టు టాక్.ఇది వరుణ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్.
కాగా ఈ ఏడాది డిసెంబర్ 8న ఈ సినిమాను రిలీజ్ చేస్తుండగా అక్టోబర్ 8న ఎయిర్ ఫోర్స్ డే( Airforce Day ) సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో వరుణ్ IAF అధికారిగా నటిస్తుండగా ఈయనకు జంటగా మిస్ యూనివర్స్ బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్( Manushi Chillar ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇక పాన్ ఇండియన్ వ్యాప్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ అండ్ రెనైస్సేన్స్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.