మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ), హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) ఆరేళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకొని ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.ఆల్రెడీ ఇండియాలో మెగా అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు సమక్షంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్న జంట ఇప్పుడు ఇటలీలో వివాహం చేసుకోబోతున్నారు.
ఇక వీరి వివాహం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీ చేరుకున్నారు.ఇక వీరి పెళ్లి వేడుకలు కూడా మొదలైన సంగతి మనకు తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా వరుణ్ తేజ్ లావణ్య అసలు పెళ్లి ఎప్పుడు పెళ్లి ముహూర్తం ఎన్ని గంటలకు ఏంటి అనే విషయాలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఎన్ని గంటల సమయంలో వీరి వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారనే విషయాన్ని వస్తే… వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి వేడుకను మూడు రోజులపాటు హిందూ సంప్రదాయాల ప్రకారం జరిపించబోతున్నారని తెలుస్తుంది.నవంబర్ 30వ తేదీ రాత్రి నుంచి వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.నవంబర్ 30వ తేదీ రాత్రి ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో సంగీత్ ( Sangeeth ) వేడుకలు జరిగాయి.
ఇక 31వ తేదీ ఉదయం హల్దీ ( Halidi ) వేడుకలు సాయంత్రం మెహందీ( Mehandi ) వేడుక ఎంతో ఘనంగా జరగబోతుంది.ఇక ఒకటవ తేదీ వీరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది.నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల ముహూర్తంకు వరుణ్ లావణ్య తేజ్ లావణ్య మెడలో మూడు ముళ్ళు వేసి ఒక్కటవ్వనున్నారు.నవంబర్ 1 రాత్రి అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు.
ఇలా వీరి వీహవాహ రిసెప్షన్ నవంబర్ ఒకటవ తేదీ రాత్రి 8 గంటలకు ఇటలీలోనే జరగబోతుందని తెలుస్తుంది.ఇలా ఈ పెళ్లి వేడుకలకు సంబంధించినటువంటి ముహూర్తపు వివరాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.