రష్యాకు భారత్‌ను దూరం చేసేలా పావులు.. ఇండియాకు భారీ మిలటరీ ప్యాకేజ్ ప్రకటించిన అమెరికా

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు గాను అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.దీనిలో భాగంగా పలుమార్లు ఐక్యరాజ్యసమితిలో తీర్మానాలు సైతం ప్రవేశపెట్టింది.

 Us To Offer India $500 Million In Military Aid To Reduce Dependence On Russia ,-TeluguStop.com

కానీ వాటిలో వేటికీ భారత్ మద్ధతు పలకలేదు సరికదా.తటస్థంగా వుండిపోయింది.

చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచించింది.ఇది అమెరికాకు కంటగింపుగా మారింది.

కానీ భారత్‌తో వున్న అవసరాల రీత్యా ఏం మాట్లాడకుండా తన మనుషుల చేత విమర్శలు గుప్పిస్తూ వస్తోంది.

ఈ నేపథ్యంలో భారత్‌ను రష్యాకు దూరం చేయాలని గట్టి పట్టుదలతో వున్న అమెరికా పావులు కదుపుతోంది.

దీనిలో భాగంగా రక్షణపరంగా రష్యా ఆయుధాలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడానికి గాను ఇండియాకు భారీగా సైనిక సాయాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.

భారత్‌కు దాదాపు 500 మిలియన్ డాలర్ల ప్యాకేజ్ ప్రకటించే అవకాశం వుందని చెప్పారు.ఇజ్రాయెల్, ఈజిప్ట్ తర్వాత అమెరికా నుంచి ఈ స్థాయిలో మిలటరీ సాయాన్ని పొందనున్న దేశం ఇండియానే.

దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదలవుతుందని సదరు అధికారి తెలిపారు.

Telugu America, Egypt, India, Israel, Joebiden, Modi Sarkar, Russia, Ukraine, In

ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను విమర్శించడంలో భారత్ విముఖంగా వున్నప్పటికీ.దీర్ఘకాలిక భద్రతా భాగస్వామి హోదాను మనదేశానికి కట్టబెట్టాలని జో బైడెన్ యంత్రాంగం చొరవ తీసుకుంటోందని ఆ అధికారి పేర్కొన్నారు.మారుతున్న సైనిక అవసరాల రీత్యా.

భారతదేశం ఇప్పటికే రష్యాకు దూరంగా తన సైనిక వేదికలను మారుస్తుండటంతో అది మరింత వేగంగా జరిగేలా చూడాలని అమెరికా కోరుకుంటోందన్నారు.

రష్యాకు అతిపెద్ద రక్షణ కొనుగోలుదారు భారతదేశమే.

అయితే మేకిన్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మోడీ సర్కార్.రక్షణ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేయాలని భావిస్తోంది.

దీనిలో భాగంగా విదేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం తగ్గిస్తూ వస్తోంది.స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.

గత దశాబ్ధంలో భారత్ అమెరికా నుంచి 4 బిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాలను కొనుగోలు చేసింది.ఇదే సమయంలో రష్యా నుంచి 25 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆయుధ ఉత్పత్తులను కొనుగోలు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube