ఒకటా, రెండా... ఆయన అసమర్థతకు ఎన్నో ఉదాహరణలు: ట్రంప్‌పై కమలా హారిస్ విమర్శలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రచారంలో నేతల మధ్య మాటల యుద్ధం ఎక్కువవుతోంది.ముఖ్యంగా అధ్యక్ష బరిలో నిలిచిన జో బిడెన్ కంటే.

 Us Presidential Elections: Trump Has Shown Reckless Disregard For Wellbeing Of A-TeluguStop.com

ఉపాధ్యక్ష రేసులో ఉన్న భారత సంతతి సెనేటర్ కమలా హారిస్ తన వేడి వేడి విమర్శలతో ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు.ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్‌ అంటే ఒంటి కాలిమీద లేస్తున్నారు.

ఆయన అమెరికన్ల శ్రేయస్సు కోసం చేసిందేమీ లేదని, అన్ని చోట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కమల ఆరోపించారు.

అధ్యక్షుడిగా తన కనీస ధర్మాన్ని పాటించడంలో విఫలమయ్యారన్న ఆమె … దేశాన్ని రక్షించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు.

ప్రధానంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో కూడా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. కోవిడ్‌ను ట్రంప్ చాలా లైట్‌గా తీసుకున్నారని, ఆయన మొండివైఖరి కారణంగా అమెరికా ఆర్ధికంగా, సామాజికంగా భారీ మూల్యం చెల్లించుకుందని కమలా హారిస్ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu America, Donald Trump, Joe Bidden, Kamala Harris, Republic-Telugu NRI

అధ్యక్షుడిగా అమెరికన్ల సంక్షేమం కోసం పాటుపడతానని దైవసాక్షిగా లక్షలాది మంది సమక్షంలో చేసిన ప్రమాణాన్ని ట్రంప్ ఏమాత్రం మనసులో ఉంచుకుని ప్రవర్తించడం లేదని ఆమె ఆరోపించారు.కానీ డెమొక్రాట్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ అలా కాదని, ఆయన ముందుగానే ఈ మహమ్మారి గురించి హెచ్చరించిన విషయాన్ని కమల గుర్తుచేశారు.బిడెన్ ఒక ప్రణాళిక , వ్యూహంతో దేశానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారని కమలా హారిస్ స్పష్టం చేశారు.

కాగా కమలా హారిస్‌ను డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపిక చేసిన తర్వాత ఆమెను ఉద్దేశిస్తూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

హారిస్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసే అర్హత లేదన్నారు.ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపిక చేసే ముందు డెమొక్రాట్లు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుండేదని ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్- కమలా హారిస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube