Upasana : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ మొత్తం హీరోలైనప్పటికీ ఉపాసనకు బాలీవుడ్ అంటేనే ఇష్టమా?

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఒకరు.ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు తన ఫ్యామిలీ నుంచి కూడా ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

 Upasana Likes Bollywood Industry-TeluguStop.com

ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ramcharan ) పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది సక్సెస్ అందుకున్నారు.

ఇక రామ్ చరణ్ ఉపాసన( Upasana ) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పుడు వీరికి ఒక చిన్నారి కూడా జన్మించారు.అయితే ఉపాసన మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టినప్పటికీ ఈ ఇంట్లో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ ఈమెకు టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఎక్కువగా ఇష్టమని తెలిపారు.తన లైఫ్ లో ఎక్కువ పార్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీకే ప్రాధాన్యత ఉందని ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అయితే ఉపాసన బాలీవుడ్ సినిమాలను ఇష్టపడటానికి కూడా కారణం ఉంది.తన తాతయ్య చిన్నప్పటి నుంచి కూడా ఉర్దూలో చదివి ఉర్దూ ఇప్పటికి చాలా బాగా రాస్తారని తెలిపారు.

ఇక తన తండ్రి తన తాతయ్య ఇద్దరు కూడా ఉర్దూలోనే మాట్లాడుకుంటారని ఇక తన నాన్నమ్మ చిన్నప్పటినుంచి కాన్వెంట్లో చదవడం వల్ల ఆమె ఇంగ్లీష్ చాలా అద్భుతంగా మాట్లాడుతుందని తెలిపారు.ఇక తన అమ్మ తమిళ అమ్మాయి కావడంతో తమిళ భాష ఎక్కువగా మాట్లాడుతుందని ఉపాసన తెలిపారు.

ఇలా ఇంట్లో అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడటంతో తెలుగు మాట్లాడటానికి కూడా ఆస్కారం లేదని అందుకే తనకు తెలుగు మాట్లాడటం రాయడం కూడా రాదు అంటూ ఉపాసన తెలియజేశారు.ఇలా ఇంట్లో అందరూ కూడా వివిధ భాషలలో మాట్లాడటంతో మేము కూడా ఎక్కువగా హిందీ సినిమాలు చూసేవాళ్ళు అందుకే నా లైఫ్ లో ఎక్కువ భాగం బాలీవుడ్ సినిమాలే ఉంటాయని బాలీవుడ్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం అంటూ ఈమె తెలిపారు.తెలుగు సినిమాలను కూడా మేము చూసే వాళ్ళం కానీ నాకు సినిమా పేర్లు గుర్తులేవని అప్పుడు దూరదర్శన్ లో సాటర్డే హిందీ సినిమా వస్తే సండే తెలుగు సినిమా వచ్చేదని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.Upasana

ఇక చిరంజీవి మామయ్య జగదేకవీరుడు అతిలోకసుందరి( Jagadeka Veerudu Athiloka Sundari ) సినిమా అంటే తనకు ఇష్టమని తెలిపారు.ఇక మావయ్య గారి సినిమాలను కూడా నేను చూశాను కానీ నాకు సినిమా పేర్లు ఏవి గుర్తు లేవని తెలిపారు.ఇక రాంచరణ్ పెళ్లి చేసుకున్న తర్వాత తెలుగు సినిమాలను కూడా చూడటం మొదలు పెట్టాను అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల తన భర్త సినిమాలు విడుదలైనప్పుడు ఉపాసన స్వయంగా థియేటర్ కు వెళ్లి పేపర్లను చల్లుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తూ సినిమాలను చూస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఇప్పుడు తెలుగింటి కోడలుగా అడుగు పెట్టినప్పటికీ ఈమెకు తెలుగు రాయడం మాట్లాడటం రాదని తెలుస్తోంది.

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=1046209333193762
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube