మెగా కోడలు ఉపాసనకి అరుదైన గౌరవం

రామ్ చరణ్ భార్యగా టాలీవుడ్ లో అందరికి పరిచయం ఉన్న ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య అనే ట్యాగ్స్ మాత్రమే కాకుండా అంతకు మించి గుర్తింపుని ఈమ కలిగి ఉంది.

 Upasana Konidela Has Been Awarded By Ficci Flo Influential Women, Tollywood, Meg-TeluguStop.com

అపోలో హాస్పిటల్స్ ఏండీగా, యంగ్ బిజినెస్ విమెన్ గా కూడా ఈమె ప్రస్తానం ఉంది.అలాగే సోషల్ యాక్టివిటీస్ లో ఎక్కువ భాగామయ్యే ఈమె ప్రకృతి ప్రేమికురాలు కూడా.

ఆ మధ్య పక్షుల సంరక్షణ కోసం సోషల్ మీడియాలో ఓ కాంపైన్ కూడా నిర్వహిస్తుంది.అలాగే అడవుల పరిరక్షణ బాద్యతని గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇదే సమయంలో ఫిట్ నెస్, డైట్ విషయంలో కూడా ప్రత్యేకంగా వీడియోలు రూపొందిస్తూ యక్టివిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది.రామ్ చరణ్ కి ఎక్కువగా ప్రేమించే ఉపాసన అతని ఆలోచన విధానం మారడంలో కూడా కీలకంగా వ్యవహరించింది అని చెప్పాలి.

ఇలా కేవలం ఒక స్టార్ హీరో ఇంటి కోడలిగా, మరో స్టార్ హీరో భార్యగా కంటే వ్యక్తిగత ఇమేజ్ తో ఆమె తెచ్చుకున్న గుర్తింపే ఎక్కువని చెప్పాలి.ఈ నేపధ్యంలోనే ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం, గుర్తింపు దక్కాయి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్.ఎల్.ఓ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మహిళా విభాగం ఈ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ నుండి అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఉపసనా కొనిదేలను ఎంపిక చేశారు.ఆమె మహిళా చైతన్యం, సాధికారత కోసం చేస్తున్న సోషల్ సర్వీస్, మోటివేషన్ ని పరిగణంలోకి తీసుకొని ప్రభావశీల మహిళగా ఆమెని గుర్తించినట్లు తెలుస్తుంది.

ఉపాసనని స్పూర్తితో ఎంతో మంది మహిళలు ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్ లో భాగం అవుతూ తమ ఐడెంటిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube