అన్‌లాక్‌ 3.0 : ఆ నిర్మాతలు కోరుకున్నట్లే అయ్యింది

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ను దశల వారిగా కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేస్తున్న విషయం తెల్సిందే.ఇప్పటికే రెండు సార్లు లాక్‌ డౌన్‌ను సడలిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి అంటే ఆగస్టు 1 నుండి కొత్త లాక్‌ డౌన్‌ నిబంధనలు తీసుకు రానుంది.

 Unlock3.0, Movie Theaters, Schools, Central Government, New Lockdown Rules-TeluguStop.com

ఇందులో భాగంగా మరికొన్నింటికి అన్‌లాక్‌ చేసింది.ఈ అన్‌ లాక్‌ 3.0 లో థియేటర్లకు ఖచ్చితంగా అనుమతులు వస్తాయని అనుకున్నారు.పాఠశాలలు మరియు థియేటర్లు ఓపెన్‌ చేస్తారనే చర్చ జరిగింది.

విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల పున: ప్రారంభంపై ఆసక్తి చూపించలేదు.దాంతో ఇప్పట్లో పాఠశాలలు ఓపెన్‌ చేసే అవకాశం లేదని క్లారిటీ వచ్చేసింది.

ఇదే సమయంలో థియేటర్లను కూడా ఓపెన్‌ చేయవద్దని చాలా మంది కోరుకున్నారు.ఒక వేళ థియేటర్లు ఓపెన్‌ చేసినా కూడా ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదు.

కనుక థియేటర్లకు అనుమతులు ఇవ్వడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని కొందరు నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఇంకా వాటికి లాక్‌ ఉంచింది.

ఆగస్టు 31 తర్వాత వాటిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అప్పటి వరకు మెట్రో రైల్లు, థియేటర్లు బంద్‌ ఉంటాయని కేంద్రం తాజాగా విడుదల చేసిన ప్రెస్‌ నోట్‌లో పేర్కొనడం జరిగింది. థియేటర్లు బంద్‌ అయ్యి దాదాపుగా అయిదు నెలలు అవుతుంది.

తాజా నిర్ణయంతో మరో నెల రోజులు మూత పడే ఉండనున్నాయి.అంటే అర్థ సంవత్సరం థియేటర్లు మూత పడే ఉంటున్నాయి.

సెప్టెంబర్‌ 1న అయినా థియేటర్లకు లాక్‌ ఓపెన్‌ చేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube