సాధారణంగా కొందరి శరీరం, ముఖం మొత్తం తెల్లగా ఉంటాయి.కానీ, చేతులు మాత్రం నల్లగా, నిర్జీవంగా కనిపిస్తుంటాయి.
ఎండల ప్రభావం, పిగ్మెంటేషన్, గర్భ నిరోధక మాత్రలను ఓవర్ గా యూస్ చేయడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం వంటి రక రకాల కారణాల వల్ల తెల్లగా ఉండాల్సిన చేతులు నల్లగా మారుతుంటాయి.దాంతో చేతులను మళ్లీ తెల్లగా మార్చుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.
ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ స్ప్రేను డైలీ వాడారంటే. డార్క్ హాండ్స్‌ను వైట్‌గా, బ్రైట్‌గా మార్చుకోవచ్చు.మరి ఇంతకీ ఆ స్ప్రేను ఎలా సిద్ధం చేసుకోవాలో చూసేయండి.
ముందుగా రెండు నిమ్మ పండ్లను తీసుకుని సగానికి కట్ చేసి.
జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్‌ను రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, మూడు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, అర కప్పు నార్మల్ వాటర్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ లిక్విడ్‌ను స్ప్రే బాటిల్‌లో నింపుకుని ఒక నిమిషం పాటు షేక్ చేసుకోవాలి.ఆపై చేతులకు దానిని స్ప్రే చేసుకుని.సున్నితంగా వేళ్లతో రబ్ చేసుకోవాలి.గంట అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా చేతులను క్లీన్ చేసుకోవాలి.ఆ తరువాత చేతులను తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని.ఏదైనా మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ను అప్లై చేసుకోవాలి.
రోజుకు ఒక సారి ఈ ఎఫెక్టివ్ హోం మేడ్ స్ప్రేను యూజ్ చేస్తే గనుక చేతులు ఎంత నల్లగా మారినా.మళ్లీ కొద్ది రోజుల్లోనే తెల్లగా, మృదువుగా మారతాయి.
కాబట్టి, తప్పకుండా ఈ స్ప్రేను ట్రై చేయండి.