అత్త పైన కోపం ఉన్న కోడళ్లు అత్తకు సూర్యకాంతం అని నిక్ నేమ్ పెట్టుకుని పిలుస్తుంటారు.అసలు దీని వెనకు ఉన్న కథేమిటంటే.
సూర్యకాంతం.ఈ పేరంటే చాలా మందికి నచ్చదు.
ఈ పేరు వినగానే గయ్యాలి అత్త గుర్తుకువస్తుంది.కానీ ఆ నటి తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.
తెలుగు ఇండస్ట్రీలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.ఈమె తూర్పుగోదావరి జిల్లాలోని వెంకట కృష్ణరాయపురంలో పుట్టింది.
వారి తల్లిదండ్రులకు సూర్యకాంతం 14వ సంతానం.ఇందువల్ల ఆ ఇల్లు ఎప్పుడూ పిల్లలతో హంగామాగా ఉండేది.ఆ చురుకుతనం, ఉత్సాహం సూర్యకాంతంలోనూ కనిపించేవి. ఆరేండ్ల వయస్సు లోనే పాడటం, డ్యాన్స్ నేర్చుకుంది సూర్యకాంతం.నాటకంలోకి ఆమె ఎంట్రీ ఇస్తే చప్పట్లు ఆగకపోయేవి.అలా ఆమెకు మూవీస్‌పై ఇంట్రెస్ పెరిగింది.
ఎక్కడ మూవీ పోస్టర్ కనిపించినా దానిని ఆమె అలాగూ చూస్తూ ఉండిపోయేది.ఇక చివరికి వారి ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేకపోయినా యాక్టర్ కావాలనే ఇంట్రెస్ట్‌తో చైన్నైకి వెళ్లింది.
కానీ ఛాన్సులు రాలేవు.ఆమె నటన ఎవరూ స్పందిచకపోగా.
సినిమాల్లోకి నువ్వు పనికి రావంటూ అందరూ ఆమెను నిరత్సాహపరిచారు.ఆమెకు పట్టుదల ఎక్కువ.
అందుకే ప్రయత్నాలను అలాగే కొనసాగించింది.
అదే టైంలో చంద్రలేఖ మూవీలో డ్యాన్సర్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి.యాక్టింగ్ చేసేందుకు అక్కడికి వెళ్లిన సూర్యకాంతం నిరుత్సాహంగా వెనక్కి వెళ్లిపోతుండగా మేనేజర్ భూషణం ఆమెను పిలిచాడు.డ్యాన్సర్స్ తక్కువగా ఉన్నారండీ… మీకు ఇష్టమైతే డ్యాన్సర్‌గా చేయమని చెప్పాడు.
నాకు డ్యాన్స్ రాదని సూర్యకాంతం సమాధానమివ్వగా.వారికి మాత్రమే ఏమైనా వచ్చా.
చేయట్లేదా.అంటూ అతడు నవ్వాడు.
అలా డ్యాన్సర్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సూర్యకాంతం.అనంతరం ధర్మాంగద మూవీలో మూగవేషంలో నటించడంతో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది.
దీంతో నారద నారది మూవీలో ఆమెకు సపోర్టింగ్ రోల్ దక్కింది.కానీ ఆమెకు పేరు తీసుకొచ్చిన మూవీ మాత్రం సంసారం.
ఇందులో ఆమె మొదటిసారిగా గయ్యాళి అత్త రోల్‌లో నటించింది.ఇక తెలుగు వారికి గయ్యాళి అత్తగా పర్మనెంట్ గుర్తుండిపోయింది.1996లో ఆమె కన్నుమూసింది.