ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు మన భారతీయులు వలసలు వెళ్లి అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.ఆ దేశ పౌరసత్వాన్ని స్వీకరించి అక్కడి వారితో మమేకమై పోయారు.
అయితే ఆ దేశ ప్రజలుగా ఉన్నాసరే భారత సంతతి మూలాలు ఉన్న వారిగా ఎప్పుడూ మన్ననలు అందుకుంటూనే ఉంటారు.ఎంతో మంది భారతీయ ఎన్నారైలు వారు వలసలు వెళ్ళిన దేశాలలో అత్యంత కీలకమైన పదవులలో నియమితులవ్వడం, అక్కడి రాజకీయ వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్ళడం మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం.
ఎంతో మంది భారత ఎన్నారైలు కీలక పదవులలో కొలువై ఉన్నా ఆ పదవుల వలన ఆదేశ చరిత్రలో తమకంటూ ఓ పేజీను సృష్టించుకునే వారు మాత్రం అరుదుగానే ఉంటారు.
తాజాగా లండన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ భారతీయ మహిళకు అరుదైన గౌరవం లభించింది.
మొహిందార్ కె మిదా అనే భారత సంతతి మహిళ లండన్ కౌన్సిల్ మేయర్ గా ఎన్నికవ్వడం సంచలనం సృష్టించింది.వెస్ట్ లండన్ లోని ఈలింగ్ కౌన్సిల్ కి మేయర్ గా మిదా ను ఎన్నుకున్నారు.
మిదా భారత సంతతి మహిళ, అక్కడి ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన సభ్యురాలు కూడా.బ్రిటన్ లో దళితుల హక్కులపై ఎప్పటికప్పుడు తన గళం వినిపిస్తూ నిరసనలు, ఉద్యమాలతో అక్కడి ప్రజల మనస్సులలో సుస్థిరమైన స్థానం సాధించింది.
ఈ క్రమంలోనే ఈ నెల 5 వతేదీన జరిగిన ఎన్నికల్లో డోర్మర్ వెల్స్ వార్డ్ నుంచీ కౌన్సిలర్ గా పోటీ చేసి నెగ్గిన ఆమె అనూహ్యంగా మేయర్ గా ఎన్నికయ్యారు.అయితే లండన్ చరిత్రలో ఇప్పటి వరకూ భారత సంతతి వ్యక్తి మేయర్ గా పోటీ అవ్వలేదని మిదా చరిత్ర సృష్టించారని అలాగే ఓ దళిత మహిళ ఇప్పటి వరకూ మేయర్ అయిన సందర్భం లేదని మిదా ఈ రెండు విషయాలలో రికార్ద్ క్రియేట్ చేశారని స్థానిక మీడియా వెల్లడించింది.
కాగా తనకు ఇచ్చిన ఈ గౌరవం దళితలు అందరికి ఇచ్చిన గౌరవమని మిదా తెలిపారు.