ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఈరోజుల్లో అలా గంపెడుమంది పిల్లల్ని ఎవరు కనగలరని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.అయితే ఇది మనదగ్గర కాదు.
ఓ స్త్రీకి మాతృత్వం పొందడం అనేది తన జీవితంలో జరిగిన ఓ అందమైన ముచ్చట అని చెప్పుకోవాలి.దానికోసం వారు ఎన్నో గుళ్లకు తిరుగుతారు.
మరెన్నో నోములు నోస్తారు.పిల్లలు కలగడమే కష్టమైన ఈ రోజులలో ఆమె ఏకంగా 44 మంది పిల్లలు జన్మనివ్వడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును.ఉగాండాకు చెందిన ఒక మహిళ వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటాయి.40 ఏళ్లకే ఆమె 44 మంది పిల్లలు కనడం అనేది పెద్ద న్యూస్ అయింది.
వివరాల్లోకి వెళితే, ఆమె ఉగాండా నివాసి.40 ఏళ్ల వయసు కలిగిన ‘నబటాంజీ’కి 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే పెళ్లి అయింది.ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వివాహం ద్వారా ఒకరికి విక్రయించారు.
కాగా ఆమె 13 సంవత్సరాల వయస్సులోనే మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.ఆ తర్వాత ఓ అరుదైన మెడికల్ పరిస్థితి కారణంగా ఒక్కో కాన్పులో నలుగురైదుగురు చొప్పున ఇప్పటివరకు 44 మంది పిల్లలకు జన్మనివ్వడం గమనార్హం.
ఈ క్రమంలో ఆమె ఒక్కసారి మాత్రమే ఒక్క బిడ్డకు జన్మనిచ్చింది.అయితే ఆమె కన్న 44మందిలో ఆరుగురు పిల్లలు అనారోగ్యం కారణంగా చనిపోయారు.
అయితే ఒక్కో కాన్పులో సుమారు 2, 3 మరియు 4 పిల్లలకు జన్మనివ్వడం ప్రారంభించినప్పుడు, ఆమె ఆశ్చర్యపోయి డాక్టర్ దగ్టరికి వెళ్లింది.దాంతో ఆమె ఓ విచిత్రమైన ఆరోగ్య పరిస్థితి ఎదుర్కొంటోందని, దాని కారణంగా ఆమె చాలాసార్లు తల్లి అయినట్లు డాక్టర్ల నిర్ధారణ చేసారు.ఇతర మహిళలతో పోలిస్తే ఆమె అండాశయాలు అసాధారణంగా పెద్దవిగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెప్పారు.ఈ పరిస్థితిని ‘హైపర్ అండోత్సర్గము’ అంటారు.గర్భనిరోధక పద్ధతులు ఆమెకు పని చేయవని వైద్యులు ఆమెకు చెప్పారు.ఈ నేపథ్యంలో ఆమె అలా 44 మందికి జన్మనిచ్చింది.