అరబ్బు దేశమైన యూఏఈ లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి.రూల్స్ పెట్టామా అన్నట్టుగా ఉండదు అక్కడ వ్యవహారం తాము విధించిన రూల్స్ కి విరుద్దంగా నడుచుకుంటే రాజీ పడకుండా శిక్షలు అమలు చేస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా కటైనమైన శిక్షలు అమలు చేసే దేశం ఏదైనా ఆందంటే అరబ్బు దేశాలను తడుముకోకుండా చెప్పవచ్చు.అయితే తాజాగా యూఏఈ ఆన్లైన్ బ్లాక్మెయిల్ వ్యవహారాలపై, సైబర్ నేరాలపై దృష్టి సారించింది.
ప్రస్తుత సమాజంలో ఆన్లైన్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.టెక్నాలజీ పెరిగే కొద్ది ఈ తరహా మోసాలు ఎక్కువై పోవడంతో ఈ విషయంలో కటినంగా ఉండాలని డిసైడ్ అయ్యింది.
ఈ క్రమంలోనే కీలక ప్రకటన జారీ చేసింది.
ఈ నేరాలకు పాల్పడే వారికి జైలు జీవితంతో పాటు భారీగా ఫైన్స్ విధించాలని డిసైడ్ అయ్యింది.
ఈ మేరకు పబ్లిక్ ప్రోసిక్షన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆన్లైన్ ద్వారా బెదిరింపులు, బ్లాక్ మెయిల్, పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ప్రకటించింది.ఈ మోసాలకు పాల్పడే వారిపై రూ.1 కోటి జరిమానా విధించనున్నట్టుగా తెలిపింది.ఈ కేసుల్లో దోషులుగా తేలితే వాటిలో నేరారోపణలు, వారి పాత్రలను బట్టి రూ.53 లక్షల నుంచీ రూ.1 కోటి వరకూ జరిమానా విధిస్తామని, అలాగే 2 ఏళ్ళకు తగ్గకుండా జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుందని తెలిపింది.2021 నాటి ఫెడరల్ డిక్రీ లా నెంబర్ 34 లోని ఆర్టికల్ 42 ప్రకారం ఇలాంటి నేరాలను ఎదుర్కోవడమే లక్ష్యంగా జరిమానాలు విధిస్తున్నామని, ఇలాంటి తప్పులు చేయాలంటేనే భయపడేలా ఉండాలని అందుకే కటినమైన నిర్ణయాలు తీసుకునట్టుగా పబ్లిక్ ప్రోసిక్షన్ ప్రకటించింది.వ్యక్తుల యొక్క గౌరవానికి భంఘం కలిగేలా ప్రవర్తించినా సరే ఈ శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించింది.
.