ఈ మధ్య కాలంలో కొందరు ఆక్రమ దారుల్లో డబ్బులు సంపాదించాలనే కోరికతో దారుణానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది యువతులు తమ అందమైన శరీరాన్ని పెట్టుబడులుగా పెట్టి బ్లాక్మెయిలింగ్ పేరుతో అందినంత గుంజుకుంటున్నారు.
తాజాగా ఇద్దరు యువతులు పెళ్లయి పిల్లలు ఉన్నటువంటి అంకుల్ తో అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి 10 లక్షల రూపాయలు డబ్బు గుంజుకున్న ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని బర్మర్ జిల్లా రిసర ప్రాంతంలో “తగరం” అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నారు.
అయితే తగరం కుటుంబ పోషణ నిమిత్తం స్థానిక చిన్న చిన్న వ్యాపారాలు మరియు వడ్డీ వ్యాపారాలు చేసేవాడు.ఈ క్రమం స్థానికంగా ఉన్నటువంటి యువతితో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో అప్పుడప్పుడు తగరం ఆ యువతికి ఆర్థికంగా సహాయం చేసేవాడు.ఈ సహాయాలను చూసినటువంటి యువతి సోదరి కూడా తగరంతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
దీంతో తగరం ఈ అక్క చెల్లెళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ వారితో కామ క్రీడలు సాగించేవాడు.
అయితే తాజాగా యువతికి 10 లక్షల రూపాయలు అవసరం కాగా తన ప్రియుడిని అడిగింది.
కానీ అంత మొత్తాన్ని ఇచ్చేందుకు తగరం కొంతమేర నిరాకరించాడు.దీంతో ప్రియురాలు తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తనపై బలవంతంగా అత్యాచారం చేశారని కేసు పెడతానంటూ బెదిరించ సాగింది.
దీంతో తన కుటుంబ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించిన తగరం అప్పుగా తెచ్చి మరి యువతి అడిగిన డబ్బులు ఇచ్చాడు.
కానీ అంతటితో ఆగకుండా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు స్టేషన్ కి వెళ్లి తన దగ్గర నుంచి దుండగులు డబ్బు దొంగలించారని నాటకమాడాడు.దీంతో పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.ఈ విచారణలో భాగంగా తగరం ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అక్కాచెల్లెళ్ల అక్రమ సంబంధం మరియు డబ్బు కోసం ఆడిన నాటకం వంటి వాటి గురించి విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు.