తాజాగా యూపీ కి చెందిన నటి అర్చన గౌతమ్ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళింది.తిరుమల కొండ పై నానా బీభత్సం సృష్టించింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా నటి అర్చన గౌతమ్ సోమవారం రోజున తిరుపతికి వెళ్ళింది.ఈ కేవలం లోనే ఆమె శ్రీవారి దర్శనం కోసం రూ.10,500 పెట్టి టికెట్ కూడా కొనుగోలు చేసిందట.అయితే అంత డబ్బు పెట్టి టికెట్ కొనుగోలు చేసినా కూడా ఆమెకి టీటీడీ సిబ్బంది టికెట్ కూడా ఇవ్వలేదంటూ ఆమె ఆరోపించింది.
అయితే టికెట్ విషయం గురించి కౌంటర్ కి వెళ్లి అడగ్గా టీటీడీ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది.
కాగా ఈ సంఘటనకు సంబంధించిన ఆమె సెల్ఫీ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.అర్చన గౌతమ్ షేర్ చేసిన ఆ వీడియో పై టీటీడీ అధికారులు స్పందించారు.
టీటీడి సిబ్బంది సదరు నటి పై దాడి చేయడం అబద్ధమని టీటీడీ పేర్కొంది.ఈ మేరకు పూర్తి వివరాలతో టీటీడీ అధికారిక ట్విటర్ ఖాతాలో అధికారులు వివరణ ఇచ్చారు.
ఈ మేరకు ట్వీట్ చేస్తూ.టీటీడీ ఉద్యోగులపై నటి అర్చన గౌతమ్ దాడి హేయమైన చర్య అని, అవాస్తవ ఆరోపణలతో ఉద్యోగుల పైనే తప్పుడు ఫిర్యాదు చేయటాన్ని టీటీడీ ఖండిస్తూ ఈ ఘటనకు సంబంధించి వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చారు.కాగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కాగా ఈ విషయం పై కొందరు టీటీడీ సిబ్బందికీ మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు మాత్రం సదరు నటి కీ మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.