ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఈ కరోనా మరణాల సంఖ్య10 వేలకు మించిపోగా,పాజిటివ్ కేసుల సంఖ్య 2,45,000 వేల పై చిలుకే అని చెప్పాలి.
ఇంతగా అల్లడిస్తున్న ఈ వైరస్ నివారణకు ప్రపంచదేశాలు పరిశోధనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే అందరూ కూడా ఇంకా క్లినికల్ ట్రయల్స్ లో ఉండగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక ప్రకటన చేశారు.కొవిడ్-19కు మలేరియా చికిత్సలో వాడే క్లోరోక్విన్ సమర్థవంతంగా పనిచేస్తోందని ట్రంప్ ప్రకటించారు.దీన్ని కరోనా చికిత్సకు ఉపయోగించేందుకు ఎఫ్‌డీఏ ఆమోదం కూడా తెలిపినట్టు ట్రంప్ పేర్కొన్నారు.
కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు తక్షణమే క్లోరోక్విన్‌ను వినియోగించడానికి ఎఫ్‌డీఐ ఆమోదించినట్లుగా వెల్లడించారు.ఇప్పటికిప్పుడు ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు.అంతేకాదు, ఎఫ్‌డీఐ అనుమతి కోసం ఇతర యాంటీవైరల్ ఔషధాలను కూడా గుర్తించనున్నట్టు తెలిపారు.చైనా లో తొలిసారిగా నమోదు అయిన ఈ కరోనా కేసు ప్రపంచదేశాలకు విస్తరించింది.
ఈ కరోనా వైరస్ కారణంగా చైనా లో 3,245 మంది మృతి చెందగా, ఇటలీ చైనా ను దాటిపోయే స్టేజ్ కి వచ్చేసింది.ఇటలీ లో ఈ వైరస్ సోకి 3,405 మంది మృత్యువాతపడినట్లు తెలుస్తుంది.
అలానే ఇరాన్ లో 1,284,స్పెయిన్ లో 831 మరణాలు నమోదు కాగా భారతదేశంలో ఇప్పటివరకు 5 గురు కరోనా వైరస్ సోకి మరణించినట్లు తెలుస్తుంది.ఇంకా మనదేశంలో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 194 కు చేరుకున్నట్లు తెలుస్తుంది.
రోజురోజుకూ విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ని నివారించేందుకు ప్రపంచ దేశాలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.