సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం.నటన ఎలా ఉన్నా అందం అనేది హీరోయిన్లకు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ.
ఎంత అందంగా ఉంటే అన్ని అవకాశాలు వస్తాయని భావిస్తారు సినీ జనాలు.అద్భుత నటనక అందంతోడైతే ఇక ఆ హీరోయిన్లకు తిరుగుండదు.
సినిమా ప్రపంచంలోకి నిత్యం పలువురు హీరోయిన్లు వచ్చిపోతున్నా కొందరు హీరోయిన్లు మాత్రం పాతుకుపోయారు.వయసు పెరుగుతున్నా అందంలో ఏమాత్రం తేడా రాకుండా మెయింటెన్ చేస్తున్నారు.దశాబ్ద కాలంగా పోటీ ప్రపంచంలో సత్తా చాటుతున్న టాప్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
అనుష్క
2005లో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాలో మెరిసింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు ఎదరులేకుండా ముందుకు సాగుతుంది.అరుంధతి సినిమాతో తన నటనా విశ్వరూపాన్ని చూపించింది.బాహుబలి సినిమాతో మరింత క్రేజ్ సంపాదించింది.చిరగా నిశ్శబ్దం సినిమాలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తుంది.
హన్సికా
2007లో దేశముదురు సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.తన అందంతో వారెవ్వా అనిపించింది.ఈ సినిమా తర్వాత కందరీగ, దేనికైనా రెడీ, పవర్ లాంటి హిట్ సినిమాలు చేసింది.ఆ తర్వాత తమిళ సినిమా పరిశ్రమలోనూ సత్తా చాటింది.ప్రస్తుతం తను టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ దుమ్మురేపుతుంది.
కాజల్ అగర్వాల్
2007లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. లక్ష్మీ కల్యాణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత చందమామ, మగధీర, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, బాద్‌షా, ఖైదీ నంబర్ 150 సహా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.ప్రస్తుతం చిరంజీవి ఆచార్య మూవీలో నటిస్తోంది.
నయనతార
2005లో వచ్చిన రజనీకాంత్ సినిమా చంద్రముఖితో తెలుగు జనాలకు పరిచయం అయ్యింది.ఆ తర్వాత లక్ష్మీ సినిమాలో హీరోయిన్ గా చేసింది.
శ్రీరామరాజ్యంతో తెలుగు జనాలకు మరింత దగ్గరయ్యింది.ఆ తర్వాత చిరంజీవితో కలిసి సైరా సీనిమా చేసింది.
సమంత
2010లో వచ్చిన ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, అ ఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ లాంటి అద్భుత సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం శాకుంతలం అనే సినిమా చేస్తుంది.
శ్రియ
2001లో ఇష్టం సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.అనంతరం సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్, నేనున్నాను, డాన్ శీను, మనం, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం గమనం, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో నటిస్తుంది.
శ్రుతి హాసన్
2011లో అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు జనాల ముందుకు వచ్చింది శ్రుతి.అనంతరం గబ్బర్ సింగ్, బలుపు, ఎవుడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్ సినిమాలతో జనాలను ఆకట్టుకుంది.ప్రస్తుతం ప్రభాస్ సినిమా సలార్‌లో హీరోయిన్ గా చేస్తుంది.
తాప్సీ
2010లో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగులోకి వచ్చింది.ఆ తర్వాత మిస్టర్ పర్‌ఫెక్ట్, దరువు, గుండెల్లో గోదారి, సాహసం, ఆనందో బ్రహ్మ లాంటి సినిమాల్లో నటించింది.ప్రస్తుతం బాలీవుడ్ లో కొనసాగుతోంది.
తమన్నా
తెలుగులో శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది తమన్నా.అనంతరం హ్యాపీ డేస్ లో చేసింది.100% లవ్, రచ్చ, తడాఖా, బాహుబలి, ఊపిరి సినిమాలో నటించింది.అటు ఎఫ్-2తో మంచి విజయాన్ని అందుకుంది.ప్రస్తుతం సీటీమార్, గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3, మేస్ట్రో సినిమాల్లో నటిస్తుంది.
త్రిష
2003లో వచ్చిన నీ మనసు నాకు తెలుసు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.అనంతరం వర్షం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ, బాడీగార్డ్ లాంటి సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది.