అప్పట్లో ఒక లేడీ సినిమా రివ్యూయర్ అజిత్ నటించిన మూవీకి చెత్త రివ్యూ ఇచ్చింది.ఆమె రివ్యూ పట్ల ఫ్యాన్స్ కు తిక్కరేగింది.
సదరు ఫీమేల్ రివ్యూయర్ ను రేప్ చేస్తామని బెదిరించారు.మరికొంత మంది చంపేస్తామని హెచ్చరించారు.
ఇంకొంత మంది అసభ్యంగా బూతులు తిట్టారు.ఈ ఘటన పట్ల అజిత్ రంగంలోకి దిగారు.
ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.ఆడవాళ్లపై అడ్డగోలుగా దాడిచేసే వారు తన ఫ్యాన్స్ కాదని చెప్పారు.
ఇలాంటి ఫ్యాన్స్ తన కొద్దని తేల్చి చెప్పారు.ఇప్పటికైనా సదరు రివ్యూయర్ మీద దాడి ఆపాలని కోరారు.
దీంతో ఆమెపై ట్రోల్స్ ఆగిపోయాయి.ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.
పలువురు ఫీమేల్ సెలబ్రిటీలు కూడా టాలీవుడ్ స్టార్స్ మీద కామెంట్స్ చేశారు.అప్పుడు తెగ రచ్చ జరిగింది.ఆ రచ్చ ఏంటో ఇప్పుడు చూద్దాం.
పవన్ కల్యాణ్ – అనుమప
పవన్ కల్యాణ్ తాజాగా నటించిన వకీల్ సాబ్ సినిమా గురించి అనుమప ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసింది.ఆ ట్వీట్ లో పవన్ కల్యాణ్ అండ్ ప్రకాశ్ రాజ్ సర్ అని రాసింది.మా హీరోకి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వలేదని రచ్చ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్
ట్విట్టర్ లో ఒక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పండి అంటూ ట్వీట్ చేశాడు.తనెవరో నాకు తెలియదు అని చెప్పింది.దీంతో ఆమెను అమ్మనా బూతులు తిట్టారు తారక్ ఫ్యాన్స్.
విజయ్ దేవరకొండ – యాంకర్ అనసూయ
అర్జున్ రెడ్డి సినిమాలో ఏం మాట్లలాడుతున్నవ్ రా అనే డైలాగ్ ఉంది.దీనిమీద యాంకర్ అనసూయ కామెంట్ చేసింది.నువ్ చేసే జబర్దస్త్ లో ఏముంది అంటూ మొదలు పెట్టారు.
రాధికా ఆప్టే
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఆమె కామెంట్ చేసింది.కానీ తన పట్ల అబ్యూస్ గా ప్రవర్తించిన హీరో ఎవరో చెప్పలేదు.ఈమెపైనా కొందరు మాటలదాడి చేశారు.
మహేష్ బాబు – సమంతా
మహేష్ బాబు నేనొక్కడినే పోస్టర్ పై నెగెటివ్ కామెంట్ చేసింది.ఈమె పైనా ప్రిన్స్ ఫ్యాన్స్ ఎగబడ్డారు.
సందీప్ రెడ్డి వంగ – గాయని చిన్మయి
ఈ దర్శకుడు, నేపథ్య గాయని చిన్మయి ట్విట్టర్ వేదికగా మాటల యుద్దానికి దిగారు.
తాప్సీ
తొలి సినిమాలో నాపొట్టపై కొబ్బరికాయ కొట్టారు అని నవ్వింది.దీనిపై నెటిజన్లు ట్రోలింగ్ కు దిగారు.