చెద పురుగుల నుండి గోధుమ పంటను సంరక్షించే పద్ధతులు..!

చెదపురుగు( Termites )లు భూగర్భంలో గుళ్లను ఏర్పాటు చేసుకొని పంట వేశాక విత్తనాలను, లేత మొక్కలను, వేర్లను తినేసి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి.ఈ చెదపురుగులు అధికంగా తేమతో కూడిన ప్రాంతంలో ఉంటాయి.

 Tips To Protect Wheat Crop From Termites,termites,wheat Crop,wheat Cultivation,a-TeluguStop.com

ఇక చనిపోయిన చెట్ల కొమ్మ కొయ్యలలో ఈ చెదపురుగుల ఉంటే వీటిని అరికట్టడం అసాధ్యం.

లేత మొక్కలు వాడిపోయినప్పుడు, మొక్కల మొదల వద్ద రంద్రాలు ఏర్పడినప్పుడు ఈ చెదపురుగులు పంటను ఆశించినట్లుగా నిర్ధారించుకోవాలి.

అక్కడ ఒకసారి తవ్వి చూస్తే వేర్లు మరియు కాండం అంత డొల్లగా అయిపోయి ఎండిపోవడం గమనించవచ్చు.మొక్కలు మొలక దశలో ఉన్నప్పుడే ఈ పురుగులు పంటపై దాడి చేస్తాయి.

ఈ పురుగుల ప్రధాన లక్ష్యం వేర్లను నాశనం చేయడమే.

Telugu Agriculture, Tips, Termites, Wheat Crop, Wheat-Latest News - Telugu

ఉష్ణోగ్రత( Temperature ) అధికంగా ఉన్న సమయంలో ఈ పురుగులు మట్టి లోపల ఉండి, ఉదయం సాయంత్రం వేళలో బయటికి వస్తాయి.కాబట్టి ఈ పురుగుల ఉనికిని సాయంత్రం సమయాలలో గుర్తించవచ్చు.ఈ పురుగులు పంటని ఆశించకుండా చేయవలసిన సంరక్షణ చర్యలు ఏమిటో చూద్దాం.

పొలంలో గోధుమ విత్తనాలు( Wheat Cultivation ) నాటే సమయంలో అధిక తేమ లేకుండా నేల కాస్త పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి.విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతనే పొలంలో నాటుకోవాలి.

ఇక విత్తిన తర్వాత ఉదయం, సాయంత్రం వేళలలో పంటను గమనిస్తూ చెద పురుగులు ఆశించిన మొక్కలను గుర్తించి వెంటనే పంట నుండి వేరు చేయాలి.పొలంలో పనిచేస్తున్నప్పుడు మొక్కలకు గాయాలు కాకుండా జాగ్రత్తపడాలి.

పంట కోతల తర్వాత పంట అవశేషాలను పంట నుంచి పూర్తిగా తొలగించాలి.ఎందుకంటే పంట అవశేషాలు భూమిలో కుళ్ళిపోతే ఆ ప్రాంతంలో చెదపురుగులు గూళ్లను ఏర్పాటు చేసుకొని జీవిస్తాయి.

Telugu Agriculture, Tips, Termites, Wheat Crop, Wheat-Latest News - Telugu

ఇక రసాయన పద్ధతిలో ఈ పురుగులను అరికట్టడం కోసం డెల్టా మెత్రిన్, ఇమిడా క్లోప్రిడ్ లను చెదపురుగులు ఉండే గుళ్ళ లోపలికి ఇంజక్ట్ చేయడం వల్ల ఈ పూర్తిగా నాశనం చేయబడతాయి.ఇక క్రమం తప్పకుండా రెండు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయడం వల్ల వివిధ రకాల చీడపిడల బెడద ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube