లోకంలో జరుగుతున్న రోడ్దు ప్రమాదాలను చూస్తుంటే బయటకు వెళ్లిన మనిషి ఇంటికి చేరుకునే వరకు గ్యారంటీ లేదనిపిస్తుంది.ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట ఎన్నో రోడ్దు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇకపోతే తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన ఘటన పలువురిని కలిచి వేస్తుంది.
ఆ వివరాలు చూస్తే.నిజామాబాద్ కు చెందిన ఉమాకాంత్ (50) మల్లారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇలా ఈ రోజు తన విధులు ముగించుకుని మల్లారం నుండి తన స్కూటీపై నిజామాబాద్ వస్తుండగా నగరంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట అతివేగంగా వస్తున్న టిప్పర్ ఢీ కొనడంతో ఉమాకాంత్ సంఘటనా స్థలంలోనే మరణించాడు.ఇక ప్రమాద ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తర్వాత కేసు నమోదు చేసుకుని టిప్పర్ ని సీజ్ చేసి, పరారైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారట.