ఈరోజు ఉదయం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు( Hyderabad Outer Ring Road ) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం( Road Accident ) సంభవించింది.ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.
మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.దీంతో ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
సరిగ్గా ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట – కీసర మధ్యలో ఔటర్ రింగ్ రోడ్డు కిమీ 66 నెంబర్ ఎదురుగా జరిగింది.లారీ, టాటా ఏసీఈ, కారు ఢీ కొన్నాయి.
శామీర్ పేట – కీసర( Shamirpet – Keesara ) మధ్యలో లియోనియా రిసార్ట్( Leonia Resort ) వద్ద ఘట్ కేసర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి డివైడర్ పైనుంచి ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం. కారుని ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో లారీ పొదల్లోకి దూసుకెల్లగా.ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు.మృతులలో లారీ డ్రైవర్ అదేవిధంగా బొలెరో వాహనంలోని ఇద్దరు ఉన్నారు.దీంతో ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.