Balakrishna : హిట్లు ఎలా సాధించాలో బాలయ్యను చూసి నేర్చుకోవాల్సిందే.. బాలయ్య సక్సెస్ సీక్రెట్ ఇదేనంటూ?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలంటే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి.బ్యాగ్రౌండ్ ఉన్నా కెరీర్ పరంగా చేస్తున్న తప్పుల వల్ల చాలామంది హీరోలు ఇండస్ట్రీకి దూరమవుతున్నారు.

 This Is The Success Secret Of Balakrishna Details Here Goes Viral In Social Med-TeluguStop.com

సీనియర్ హీరోల సినిమాలు సైతం పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి.అయితే హిట్లు ఎలా సాధించాలో బాలయ్య( Balakrishna )ను చూసి నేర్చుకోవాల్సిందే అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Akhanda, Balakrishna, Secret, Tollywood-Movie

బాలయ్య తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకోవడంతో పాటు ప్రేక్షకులు తన నుంచి, తన సినిమాల నుంచి కోరుకునే అంశాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బాలయ్య సక్సెస్ సీక్రెట్ సైతం ఇదే కావడం గమనార్హం.ఒకప్పుడు వరుస ఫ్లాపుల వల్ల ఇబ్బందులు పడ్డ బాలయ్య ఇప్పుడు మాత్రం కథల విషయంలో జాగ్రత్త పడటం వల్ల భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుంటున్నారు.

Telugu Akhanda, Balakrishna, Secret, Tollywood-Movie

బాలయ్య దర్శకుల ఎంపికలో సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తనను డీల్ చేసే సత్తా ఉన్న దర్శకులకు మాత్రమే మూవీ ఆఫర్లను ఇస్తున్నారు.బాలయ్య ఒక సినిమా పూర్తైన తర్వాతే మరో సినిమాలో నటిస్తూ సినిమాలకు సంబంధించి తప్పులు జరగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

వరుస విజయాల వల్ల బాలయ్య పారితోషికం( Remuneration ) 30 కోట్ల రూపాయలకు చేరింది.బాలయ్య సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయనే సంగతి తెలిసిందే.

నిర్మాతలకు బాలయ్య సినిమాలు ఊహించని రేంజ్ లో లాభాలను అందిస్తున్నాయి.బాలయ్య రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నందమూరి బాలకృష్ణ ఇతర నందమూరి హీరోలతో కలిసి భారీ మల్టీస్టారర్( Multi starrer ) దిశగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.బాలయ్య మాస్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube